India-China Army: నేడు భారత్‌ డ్రాగన్​తో 19వ దఫా చర్చలు.. సరిహద్దు వద్ద భారీగా సైనికుల మోహరింపు.. సమస్యలు కొలిక్కి వచ్చేనా..

|

Aug 14, 2023 | 8:21 AM

భారత్​-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు.. సైనిక అధికారుల స్థాయి చర్చలు మరోసారి జరగనున్నాయి. ఇప్పటి వరకు ఉద్రిక్తలు తగ్గించే విషయంపై.. 18 సార్లు సమావేశాలు జరగ్గా.. ఈ రోజు 19వ దఫా చర్చ జరగనున్నాయని అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా.. భారత్‌, చైనా సైనికాధికారుల చర్చలు సాగనున్నాయి.

India-China Army: నేడు భారత్‌ డ్రాగన్​తో 19వ దఫా చర్చలు.. సరిహద్దు వద్ద భారీగా సైనికుల మోహరింపు.. సమస్యలు కొలిక్కి వచ్చేనా..
India China Military Talks
Follow us on

భారత్​-చైనా సైనికాధికారుల 19వ దఫా సమావేశం నేడు జరగనుంది. సరిహద్దుల్లో శాంతియత వాతావరణం నెలకోల్పడం కోసం ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన ఎయిర్ లిఫ్టింగ్ సామర్ధ్యాన్ని మెరుగుపరచుకుంది. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను తూర్పు లడఖ్‌కు తరలించింది భారత్‌.

భారత్​-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు.. సైనిక అధికారుల స్థాయి చర్చలు మరోసారి జరగనున్నాయి. ఇప్పటి వరకు ఉద్రిక్తలు తగ్గించే విషయంపై.. 18 సార్లు సమావేశాలు జరగ్గా.. ఈ రోజు 19వ దఫా చర్చ జరగనున్నాయని అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా.. భారత్‌, చైనా సైనికాధికారుల చర్చలు సాగనున్నాయి. 18వ దఫా చర్చలు ఏప్రిల్​ 23న జరగ్గా.. నాలుగు నెలల తరువాత మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు వేదికగా చుషుల్-మోల్డో సరిహద్దులోని భారత్​ వైపు ప్రాంతం అని తెలుస్తోంది.

మరోవైపు మూడేళ్ల క్రితం భారత్‌-చైనా సరిహద్దులోని గల్వాన్‌లోయలో చోటు చేసుకున్న ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు పలుమార్లు సైనిక చర్చలు జరపడంతో పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయి. కానీ, ఊహించని పరిణామాలు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ఎవరికి వారు సన్నద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే భారత్‌ తూర్పు లద్దాఖ్‌ ప్రాంతానికి ఇప్పటి వరకు 68 వేల మంది సైనికులను తరలించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ప్రత్యర్థి కదలికలను ఎప్పటికప్పుడు గమనించి, చర్యలకు సిద్ధంగా ఉండేందుకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన ఎస్‌యూ-30ఎంకేఐ, జాగ్వార్‌ యుద్ధవిమానాలను అక్కడికి పంపినట్లు తెలిపాయి. వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్టింగ్‌ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. ఇటీవల మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంపై డేగకన్ను ఉంచేందుకు పైలట్‌ లేకుండా నడిచే రిమోట్లీ పైలటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా భారత్‌ మోహరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..