అక్కడ చర్చలు, ఇక్కడ లడాఖ్ వద్ద భారత-చైనా దళాల కాల్పులు

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా మంత్రి వాంగ్ ఈ  ఈ నెల 10 న మాస్కోలో ఉద్రిక్తతల నివారణకు చిరునవ్వుల మధ్య చర్చలు జరుపుతుండగా ఇక్కడ లడాఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద ఉభయ దేశాల సైనికులు..

అక్కడ చర్చలు, ఇక్కడ లడాఖ్ వద్ద భారత-చైనా దళాల కాల్పులు

Edited By:

Updated on: Sep 16, 2020 | 11:24 AM

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా మంత్రి వాంగ్ ఈ  ఈ నెల 10 న మాస్కోలో ఉద్రిక్తతల నివారణకు చిరునవ్వుల మధ్య చర్చలు జరుపుతుండగా ఇక్కడ లడాఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద ఉభయ దేశాల సైనికులు వార్నింగ్ షాట్స్ పేల్చుకున్నారట.. సుమారు 100 నుంచి 200 రౌండ్ల కాల్పులు జరిగినట్టు సైనికవర్గాలు తెలిపాయి. చైనా దళాలను పట్టించుకోకుండా మన జవాన్లు ధైర్యంగా ఫింగర్ -4 ప్రాంతంలో మిలిటరీ పోస్టును ఏర్పాటు చేశాయి. గతవారం జరిగిన మరో ఘటనలో చైనా సేనలు గాల్లోకి కాల్పులు జరిపారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. అటు-సైనిక, దౌత్య స్థాయిల్లో ఉభయదేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, పాంగాంగ్ సరస్సు మాత్రం పరస్పర కాల్పులతో ‘ఉలిక్కిపడుతూనే ఉంది.