స్పేస్ టెక్నాలజీ, సౌరశక్తిపై భారత్‌తో బహ్రెయిన్‌ ఒప్పందం..

| Edited By:

Aug 25, 2019 | 1:27 AM

భారత్ ,బహ్రెయిన్ దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, సౌర శక్తి , అంతరిక్ష రంగాలు మరియు సంస్కృతికి సంబంధించిన అంశాలపై పరస్పర అంగీకారం కుదుర్చుకున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ బహ్రెయిన్ పర్యటన సందర్భంగా శనివారం ప్రిన్స్ ఖలీఫాతో ఈ ఒప్పందాలను చేసుకున్నారు. బహ్రెయిన్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీకి ఇక్కడ అరుదైన గౌరవం లభించింది. ఇరు దేశాల మధ్య సంస్కృతి, అంతరిక్ష రంగాలు, అంతర్జాతీయ సౌరశక్తి (ఐఎస్ఏ)కి సంబంధించిన అంశాలపై ఎమ్ఓయూలు చేసుకున్నారు. భారత అంతరిక్ష […]

స్పేస్ టెక్నాలజీ, సౌరశక్తిపై  భారత్‌తో బహ్రెయిన్‌  ఒప్పందం..
Follow us on

భారత్ ,బహ్రెయిన్ దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, సౌర శక్తి , అంతరిక్ష రంగాలు మరియు సంస్కృతికి సంబంధించిన అంశాలపై పరస్పర అంగీకారం కుదుర్చుకున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ బహ్రెయిన్ పర్యటన సందర్భంగా శనివారం ప్రిన్స్ ఖలీఫాతో ఈ ఒప్పందాలను చేసుకున్నారు. బహ్రెయిన్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీకి ఇక్కడ అరుదైన గౌరవం లభించింది. ఇరు దేశాల మధ్య సంస్కృతి, అంతరిక్ష రంగాలు, అంతర్జాతీయ సౌరశక్తి (ఐఎస్ఏ)కి సంబంధించిన అంశాలపై ఎమ్ఓయూలు చేసుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో, బహ్రెయిన్ అంతరిక్ష సంస్ధ బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీల మధ్య స్పేస్ టెక్నాలజీ విషయంలో పరస్పర అంగీకారం కుదిరింది. అదే విధంగా సౌరశక్తికి, సంస్కృతికి సంబంధించి కూడా అంగీకారం కుదిరింది.