INDIA Alliance: మరో కీలక భేటీకి సిద్ధమైన ఇండియా కూటమి.. వీటిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం..!

|

Sep 13, 2023 | 9:06 AM

INDIA Alliance: ఇండియా కూటమి మరో కీలక భేటీకి సిద్ధమైంది. పాట్నా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ మీటింగ్స్‌ తర్వాత ఫస్ట్‌టైమ్‌ సమన్వయ కమిటీ సమావేశం కాబోతోంది. 14మందితో కూడిన కోఆర్డినేషన్‌ టీమ్‌ మొదటిసారి కూర్చోబోతోంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో ఈ కీలక మీటింగ్‌ జరగబోతోంది. ఇండియా కూటమిలో అత్యంత కీలకమైంది ఈ సమన్వయ కమిటీ. విధానపరమైన అధికారాలను ఈ టీమ్‌కే కట్టబెట్టింది ఇండియా కూటమి. ఏ నిర్ణయమైనా ఈ కమిటీనే తీసుకోనుంది. అంటే, ఈ పద్నాలుగు మంది చేతిలోనే ఇండియా కూటమి...

INDIA Alliance: మరో కీలక భేటీకి సిద్ధమైన ఇండియా కూటమి.. వీటిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం..!
India Alliance
Follow us on

INDIA Alliance: ఇండియా కూటమి మరో కీలక భేటీకి సిద్ధమైంది. పాట్నా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ మీటింగ్స్‌ తర్వాత ఫస్ట్‌టైమ్‌ సమన్వయ కమిటీ సమావేశం కాబోతోంది. 14మందితో కూడిన కోఆర్డినేషన్‌ టీమ్‌ మొదటిసారి కూర్చోబోతోంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో ఈ కీలక మీటింగ్‌ జరగబోతోంది. ఇండియా కూటమిలో అత్యంత కీలకమైంది ఈ సమన్వయ కమిటీ. విధానపరమైన అధికారాలను ఈ టీమ్‌కే కట్టబెట్టింది ఇండియా కూటమి. ఏ నిర్ణయమైనా ఈ కమిటీనే తీసుకోనుంది. అంటే, ఈ పద్నాలుగు మంది చేతిలోనే ఇండియా కూటమి ప్రయాణం, భవిష్యత్‌ ఆధారపడి ఉంది. వీళ్లు తీసుకునే నిర్ణయాలే కూటమిని నడిపించబోతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల దగ్గర్నుంచి సీట్ల పంపకాల వరకు సమన్వయ కమిటీదే ఫైనల్‌ నిర్ణయం. అందుకే, ఇవాళ జరిగే ఈ సమావేశం అత్యంత కీలకంకాబోతోంది.

పాట్నా, బెంగళూరు, ముంబై సమావేశాల తర్వాత ఢిల్లీలో భేటీ అయ్యారు ఇండియా కూటమి సభ్యులు. ఖర్గే నివాసంలో సమావేశమై, వన్‌నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ ఇష్యూపై చర్చించారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మాట్లాడుకున్నారు. అయితే, కోఆర్డినేషన్‌ కమిటీ భేటీ మాత్రం దీనికి భిన్నంగా జరగనుంది. కేవలం, కూటమి అజెండా, ముందుకు కలిసి సాగడం, సర్దుబాట్లపైనే ఫోకస్‌ పెట్టనుంది. ఆయా రాష్ట్రాల్లో కూటమి నేతలు కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు ఎలా చేయాలో సూచనలు చేయనుంది. భవిష్యత్‌ కార్యాచరణతోపాటు కూటమి ముందు కంప్లీట్‌ రూప్‌మ్యాప్‌ను పెట్టనుంది సమన్వయ కమిటీ.

ఇండియా కూటమి ఐదో భేటీకి రెడీ అయ్యింది. అత్యంత కీలకమైన కోఆర్డినేషన్‌ టీమ్‌ ఇవాళ సమావేశం కాబోతోంది. అయితే, గత నాలుగు భేటీకి భిన్నంగా ఇది జరగబోతోంది. సమన్వయ కమిటీ అసలెందుకు సమావేశమవుతోంది. ఏఏ అంశాలపై చర్చించబోతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..