PM Narendra Modi: భారత్‌లో నేడే నవశకానికి నాంది.. 5G సేవలను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Oct 01, 2022 | 10:03 AM

ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ 5G సేవల గురించి మాట్లాడారు. దేశంలో 5జీ సేవలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు.

PM Narendra Modi: భారత్‌లో నేడే నవశకానికి నాంది.. 5G సేవలను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..
Pm Modi

దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5G సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ( అక్టోబర్ 1) లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ 5G సేవల గురించి మాట్లాడారు. దేశంలో 5జీ సేవలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి మోడీ చెప్పారు. దీనికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని మొదటి విడతగా ప్రధాన నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. మొదటగా పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆతర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా కేంద్రం ప్రణాళికలు చేసింది. ప్రధాని మోడీ చెప్పినట్లుగానే ఈ రోజు 5జీ సేవలు ప్రారంభించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంది. దీనిని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DOT), సెల్యులార్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా నిర్వహించనున్నాయి. దేశంలో 5G ఆర్థిక ప్రభావం 2035 నాటికి US$ 450 బిలియన్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేంద్రం శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంపిక చేసిన నగరాల్లో 5G సేవలను ప్రారంభిస్తారని వెల్లడించింది. అంతేకాకుండా అక్టోబర్ 1 నుంచి 4 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ఆరో ఎడిషన్‌ను కూడా మోడీ ప్రారంభించనున్నారు. విశేషమేమిటంటే 5G నెట్‌వర్క్‌ డేటా వేగం 4G కంటే చాలా రెట్లు ఎక్కువ వేగాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఎలాంటి అంతరాయం లేకుండా మెరుగైన కనెక్టివిటీని అందిస్తాయి. డేటాను పంచుకునేందుకు వీలుగా బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేసిన పరికరాలను అనుసంధానించనున్నాయి. ఈ మొదటి దశ సేవలు అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే నగరాలు ఉన్నాయి.

కొత్త ఆర్థిక అవకాశాలు – సామాజిక ప్రయోజనాలు

5G కొత్త ఆర్థిక అవకాశాలు – సామాజిక ప్రయోజనాలను తీసుకురాగలదని కేంద్రం భావిస్తోంది. దీని కారణంగా ఇది భారతీయ సమాజానికి పరివర్తన శక్తిగా మార్చే అవకాశం ఉంది. ఇది దేశ వృద్ధికి సాంప్రదాయిక అడ్డంకులను తొలగించడంలో, స్టార్టప్‌లు, వ్యాపార సంస్థల ద్వారా నూతన ఆవిష్కరణలను రూపొందించడానికి, కొనసాగించడానికి, అలాగే డిజిటల్ ఇండియా విజన్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడుతుంది.

దేశంలోనే అతిపెద్ద టెలికాం స్పెక్ట్రమ్ వేలంలో రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షల కోట్ల బిడ్లు వచ్చాయి. ఇందులో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన జియో 87,946.93 కోట్ల రూపాయల బిడ్‌తో విక్రయించిన మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు సగభాగాన్ని కొనుగోలు చేసింది. భారతదేశపు అత్యంత సంపన్న సంస్థ అయిన గౌతమ్ అదానీ గ్రూప్ 400 MHz కోసం 211.86 కోట్ల రూపాయల బిడ్ వేసింది. అయితే, ఇది పబ్లిక్ టెలిఫోన్ సేవలకు ఉపయోగించలేదు. అదే సమయంలో, టెలికాం దిగ్గజం సునీల్ భారతీ మిట్టల్ భారతీ ఎయిర్‌టెల్ రూ. 43,039.63 కోట్ల బిడ్‌ను దాఖలు చేయగా, వొడాఫోన్-ఐడియా రూ. 18,786.25 కోట్లకు దాఖలు చేసింది.

టెల్కోలు వీలైనంత త్వరగా 5G సేవను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నందున రాబోయే కాలంలో మెరుగైన డేటా వేగం, అంతరాయాలు లేని నెట్‌వర్క్ కోసం భారత్ సిద్ధమవుతోంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా కస్టమర్‌లు కూడా పూర్తిగా ఈ సౌకార్యాన్ని అనుభవించగలుగుతారు. 5G టెలికమ్యూనికేషన్ సేవలు మొబైల్‌లు, ఇతర పరికరాలలో కొన్ని సెకన్ల వ్యవధిలో అధిక-నాణ్యత దీర్ఘ-కాల వీడియో లేదా మూవీ డౌన్‌లోడ్‌లను అనుమతిస్తాయి. ఇది ఒక చదరపు కిలోమీటరులో దాదాపు లక్ష కమ్యూనికేషన్ పరికరాలను సపోర్ట్ చేస్తుంది. ఈ సేవ సూపర్‌ఫాస్ట్ వేగాన్ని (4G కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ) అందిస్తుంది. కనెక్టివిటీ ఆలస్యాలను తగ్గిస్తుంది. బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేసిన పరికరాలలో నిజ-సమయ డేటా భాగస్వామ్యాన్ని అందిస్తుంది. ఇది 3D హోలోగ్రామ్ కాలింగ్, మెటావర్స్ అనుభవం, విద్యాపరమైన అనువర్తనాలను వేగవంతంగా పునర్నిర్వచించగలదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu