Independence Day: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట.. ఈ సారి కార్మికులు, మత్స్యకారులు, సర్పంచ్, టీచర్స్ ప్రత్యేక అతిధులు

చారిత్రాత్మకమైన ఎర్రకోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 2023కి హాజరు కావాల్సిందిగా విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల ఉపాధ్యాయులను విశిష్ట 'ప్రత్యేక అతిధులుగా' ఆహ్వానించారు. పాఠశాల విద్య,  అక్షరాస్యత విభాగం విద్యా రంగంలో అద్భుతంగా పనిచేసిన 50 మంది పాఠశాల ఉపాధ్యాయులను ఎంపిక చేసింది.

Independence Day: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట.. ఈ సారి కార్మికులు, మత్స్యకారులు, సర్పంచ్, టీచర్స్ ప్రత్యేక అతిధులు
PM Narendra Modi

Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 14, 2023 | 12:43 PM

దేశ రాజధాని ఢిల్లీ స్వాతంత్య వేడుకలకు ముస్తాబవుతోంది. రేపు ఆగస్టు 15వ తేదీ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఈసారి 1800 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో కూలీలు, మత్స్యకారులు, సర్పంచ్, నర్సింలు, ఉపాధ్యాయులు ఉన్నారు. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులను ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. కార్మికులు తమ భార్య లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. అదే సమయంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ పథకంతో సంబంధం ఉన్న రైతులు కూడా వేడుకలో పాల్గొంటారు.

చారిత్రాత్మకమైన ఎర్రకోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 2023కి హాజరు కావాల్సిందిగా విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల ఉపాధ్యాయులను విశిష్ట ‘ప్రత్యేక అతిధులుగా’ ఆహ్వానించారు. పాఠశాల విద్య,  అక్షరాస్యత విభాగం విద్యా రంగంలో అద్భుతంగా పనిచేసిన 50 మంది పాఠశాల ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉపాధ్యాయులందరూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్,  దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగతన్ పాఠశాలలకు చెందినవారు.

ఇవి కూడా చదవండి

ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 మంది జంటలను తమ సంప్రదాయ దుస్తుల్లో ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ సంఖ్యలో అతిథులను ఆహ్వానించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రత్యేక అతిథులుగా వారి జీవిత భాగస్వాములతో పాటు దాదాపు 1,800 మందిని ఆహ్వానించారు. ప్రభుత్వ ప్రజా భాగస్వామ్య విధానానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ప్రత్యేక అతిథిలుగా ఆహ్వానం..

ఈ ప్రత్యేక అతిథులు 660 కంటే ఎక్కువ వైబ్రెంట్ గ్రామాలకు చెందిన 400 మందికి పైగా సర్పంచ్‌లు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీమ్‌తో అనుబంధించబడిన 250 మంది రైతులు, కొత్త పార్లమెంటు భవనంతో సహా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌తో అనుబంధించబడిన 50 మంది కార్మికులు ఉంటారు. అంతేకాదు  ఖాదీ కార్మికులు, సరిహద్దు రహదారుల నిర్మాణం, అమృత సరోవర్, హర్ ఘర్ జల్ యోజన, అలాగే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా పాల్గొంటారు.

సెల్ఫీ పాయింట్లు పెట్టారు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీలోని వివిధ 12 చోట్ల సెల్ఫీ పాయింట్లు కూడా పెట్టారు. వీటిలో నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్ ఘాట్, జామా మసీద్ మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్, ITO మెట్రో గేట్, నౌబత్ ఖానా, షీష్ గంజ్ గురుద్వారా ఉన్నాయి. ఈ సెల్ఫీ పాయింట్లు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు,  కార్యక్రమాలను ప్రదర్శిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..