Pm Modi
Azadi Ka Amrit Mahotsav: కార్యక్రమం ఏదైనా తన డ్రెస్సింగ్ స్టైల్‌తో స్పెషల్‌గా కనిపిస్తారు ప్రధాని మోదీ. ఏ పర్యటనకు వెళ్లినా అక్కడి సంప్రదాయ దుస్తులను ధరించి స్టైలిష్‌గా ఉంటారు. ఆయన ధరించే తలపాగాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇవాళ ఇండిపెండెన్స్ డే(Independence Day 2022) సందర్భంగా ప్రధాని ధరించిన రకరకాల తలపాగాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
- 2014లో ప్రధాని మోదీ తొలిసారిగా ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు. క్రీమ్ కలర్ డ్రస్ ధరించిన ప్రధాని..రెడ్ కలర్ తలపాగాకు గ్రీన్ కలర్ బోర్డర్ ఉండేలా డిజైన్ చేశారు. అంటే తన డ్రస్సులో మూడు రంగులు ఉండేలా చూసుకున్నారు ప్రధాని.
- ఇక 2015లో ప్రధాని మోడీ క్రీమ్ కలర్ కుర్తా, దానిపై జాకెట్ వేసుకున్నారు. ఆరెంజ్ కలర్ పగిడీపై ఆకుపచ్చ, ఎరుపు, నీలం గీతలున్న తలపాగా ధరించారు.
- 2016లో వైట్ కలర్ ప్లెయిన్ కుర్తా ధరించి ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన తలపాగా ఎరుపు, గులాబీ రంగులో ఆకట్టుకుంది.
- ఇక 2017లో నాలుగోసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..క్రీమ్ కలర్ కుర్తా ధరించారు. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌లో గీతల పగిడీని ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
- 2018లో తెలుపు రంగు కుర్తా ధరించిన ప్రధాని..ఆరెంజ్ కలర్ ప్లెయిన్ తలపాగాకు..రెడ్ కలర్ బోర్డర్‌పై చుక్కల పగిడీతో ఆకట్టుకున్నారు.
- 2019లో ఆరోసారి జెండాను ఎగురవేశారు ప్రధాని మోదీ. ఈసారి ఆయన తెలుపు రంగు కుర్తాపై బ్లాక్ కలర్ చుక్కల కండువా ధరించారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ కాంబినేషన్‌లో ఉన్న తలపాగా ధరించారు.
- 2020లో లైట్ కలర్ కుర్తాపై..ఎరుపు తెలుపు రంగుల కండువా వేసుకున్నారు. కాషాయం, పసుపు కలిసి ఉన్న పగిడీని ధరించారు.
- ఇక 2021లో ఎర్రకోటపై ప్రధాని మోదీ 8వ సారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వైట్ కలర్ కుర్తాపై బ్లూ కలర్ జాకెట్..దానిపై మెరూన్ కలర్ డిజైన్ ఉన్న కండువా ధరించారు. ఇక కాషాయం రంగుపై రెడ్ కలర్ గీతలున్న తలపాగా ధరించి ఆకట్టుకున్నారు.
ఇక ఇవాళ ఎర్రకోటపై తొమ్మిదో సారి జాతీయజెండాను ఆవిష్కరించారు ప్రధాని. వైట్ కలర్ కుర్తాపై బ్లూ కలర్ జాకెట్ ధరించిన పీఎం..వైట్ కలర్‌పై గ్రీన్, ఆరెంజ్ కలర్ గీతలతో జాతీయ జెండాను పోలి ఉన్న డిజైన్ తలపాగాను ధరించారు.
మరిన్ని స్వాతంత్ర్య దినోత్సవ కథనాల కోసం క్లిక్ చేయండి..