Independence Day: భారతదేశం కంటే ఒక్కరోజు ముందే పాకిస్తాన్‏లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. ఎందుకో తెలుసా ?

| Edited By: Anil kumar poka

Aug 02, 2022 | 7:11 PM

Independence Day:  బ్రిటిష్ పాలను నుంచి విముక్తి లభించిన రోజును దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మన ఆనవాయితి.

Independence Day: భారతదేశం కంటే ఒక్కరోజు ముందే పాకిస్తాన్‏లో  స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. ఎందుకో తెలుసా ?
Independence Day
Follow us on

Independence Day:  బ్రిటిష్ పాలను నుంచి విముక్తి లభించిన రోజును దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మన ఆనవాయితి. దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో యావత్ భారతం బానిసత్వంగా మారిపోయింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విముక్తి పొందింది. అందుకే ఆగస్ట్ 15న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈరోజున జాతీయ సెలవు దినంగా కూడా పాటిస్తున్నాము. రేపు (ఆగస్ట్ 15) భారత్ 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమైంది. అయితే మన పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం తన 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారత్ దేశానికి ఒక్కరోజు ముందు అంటే ఈరోజు (ఆగస్ట్ 14న) జరుపుకుంటుంది. 1947.. ఆగస్ట్ 15న పాకిస్తాన్, భారత్ రెండూ ఒకేరోజు స్వాతంత్రాన్ని పొందాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకరోజు ముందు ఎందుకు జరుపుకుంటుందో తెలుసుకుందామా.

అయితే పాకిస్తాన్ ఆగస్ట్ 14న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి. బ్రిటిష్ భారత్ చివరి వైస్రాయ్, భారత దేశం మొదటి గవర్నర్.. జనరల్ అయిన లార్డ్ మౌంట్‌బట్టన్, పాకిస్తాన్ పరిపాలన అధికారాన్ని దాని వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నాకు ఆగస్టు 14, 1947న కరాచీలో బదిలీ చేశారు. భారతదేశం, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా మారే తేదీ ఆగస్టు 15 కాగా.. పాకిస్తాన్ మాత్రం ఆగస్ట్ 14న అధికార మార్పిడి జరిగినందున ఆరోజునే ఆదేశం స్వాతంత్ర్య దినోత్సవంగా స్వీకరించింది.

– అలాగే జూన్ 1948లో పాకిస్తాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆదేశం భారతదేశానికి ముందు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించబడింది. అతని ఆమోదం కోసం ఈ ప్రతిపాదన జిన్నాకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆగస్టు 14కి జరుపుకుంటారు.

– ఇందుకు మతం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 14, 15, 1947 అర్ధరాత్రి రంజాన్ 27వ రోజుతో సమానంగా ఉందని వాదించారు. ఇది పవిత్ర మాసంలోని పవిత్రమైన రోజుగా వారు భావిస్తారు. అందువల్ల ఆగస్ట్ 14ను స్వాతంత్ర్య దినంగా తీసుకున్నారు.

– ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST) పాకిస్తాన్ స్టాండర్డ్ టైమ్ (PST) కంటే 30 నిమిషాల ముందు ఉండటం కూడా ఒక కారణంగా చెప్తారు. ఆగస్ట్ 15న 00:00 గంటలకు భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. అంటే పాకిస్తాన్‌లో స్థానిక సమయం ఆగస్ట్ 14 రాత్రి 11:30 గంటలు అవుతుందన్నమాట. అందుకే ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని అక్కడివారు జరుపుకుంటారు.

Also Read:

Independence Day: దేశ భక్తిని నరనరాన నింపిన తెలుగు సినిమాలు ఇవే..

మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత ‘స్వర్ణ’ పురస్కారం..? ప్రతినిధుల సభలో ఎంపీ తీర్మానం

Independence Day: మనతోపాటు..ఆగస్టు 15నాడే స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న దేశాలు ఏమున్నాయో తెలుసా..