Modi Birthday Special : మోడీ పుట్టిన రోజు కానుక.. రెండు గ్రాముల బంగారం, 720కిలోల చేపలు.. ఎవరికంటే..

|

Sep 16, 2022 | 2:26 PM

సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని నవజాత శిశువులకు బంగారు ఉంగరాలు అందించడంతోపాటు 720 కిలోల చేపలను పంపిణీ చేయాలని రాష్ట్ర బీజేపీ శ్రేణులు ప్రకటించాయి.

Modi Birthday Special : మోడీ పుట్టిన రోజు కానుక.. రెండు గ్రాముల బంగారం, 720కిలోల చేపలు.. ఎవరికంటే..
Pm Modi's Birthday
Follow us on

Modi Birthday Special : సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26వరకు దేశవ్యాప్తంగా మోడీ పుట్టిన రోజు కార్యక్రమాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మందికి పైగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులు, మోడీ అభిమానులు పలు విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఢిల్లిలోని ఓ రెస్టారెంట్‌ నిర్వాహకులు మోడీ థాళీ పేరిట రూ.8.5లక్షల బహుమతి ప్రకటించింది. తమిళనాడులో మరో బహుమతి అందజేయనున్నారు. మోడీ పుట్టినరోజున పుట్టిన పిల్లలకు బంగారం బహుమతిగా అందజేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని నవజాత శిశువులకు బంగారు ఉంగరాలు అందించడంతోపాటు 720 కిలోల చేపలను పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ తమిళనాడు యూనిట్ నిర్ణయించింది. మోడీకి 72 ఏళ్లు అవుతున్నందున 720 కిలోల చేపలు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఫిషరీస్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. చెన్నైలోని ప్రభుత్వ RSRM ఆసుపత్రిని ఇందుకు నియమించారు. ప్రధానమంత్రి పుట్టినరోజున జన్మించిన పిల్లలందరికీ బంగారు ఉంగరం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఒక్కో ఉంగరానికి దాదాపు 2 గ్రాముల బంగారం ఉంటుంది. ఇది దాదాపు రూ. 5000.

ఆ రోజు ఆసుపత్రిలో దాదాపు 10-15 ప్రసవాలు జరిపించనున్నట్టు పార్టీ స్థానిక యూనిట్ అంచనా వేసింది. ఆ రోజున పుట్టిన శిశువులకు స్వాగతం పలుకుతూ మన ప్రధాని జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం అని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అరుణ్ సింగ్ ఆగస్టు 30న పంపిన మూడు పేజీల లేఖ ప్రకారం.. గత సంవత్సరాల్లో నిర్వహించిన కార్యక్రమాల మాదిరిగానే ఈ వేడుకను ‘సేవా పఖ్వాడా’గా గుర్తించాలని అన్ని రాష్ట్రాలను కోరారు. దీని కింద, కార్యకలాపాలలో రక్తదానం, ఇతర వైద్య పరీక్షల శిబిరాలు ఉంటాయి. కేక్‌లు కట్‌ చేయవద్దని, వాహన ర్యాలీలు నిర్వహించవద్దని పార్టీ అధిష్టానం గట్టిగా కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి