కలికాలం అంటే ఇదే మరి. ఆస్తికంతటికీ వారుసుడైనా.. కన్న తల్లిదండ్రుల మెడపైనే కత్తి పెట్టి రూ. 1.14 కోట్లు కొట్టేశాడో యువకుడు(24). పట్టుమని పాతేకెళ్లు కూడా నిండలేదు కానీ, క్రైమ్ సినిమాలు బాగా చూసి కసాయిగా మారాడు. జల్సాలు, వ్యాపారంలో నష్టం రావడంతో ఆ యువకుడు ఇలా చేసినట్లు చెబుతున్నారు త్లలిదండ్రులు, పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని బాంద్రా వెస్ట్ రిక్లమేషన్ సమీపంలోని పారిజాత్ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ దౌండ్కర్(24) తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. అటు జల్సాలకు కూడా అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులను కత్తితో బెదిరించి వారి నుంచి రూ. 1.14 కోట్ల డబ్బులు కాజేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొడుకు చర్యపై పోలీసులను ఆశ్రయించారు దంపతులు. రాహుల్ ఇలా చేయడం తొలిసారి కాదని, ఇంతకు ముందు కూడా ఇలాగే చేశాడని బాధిత పేరెంట్స్ తమ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడని పేర్కొన్నారు.
గతంలో వ్యాపారంలో నష్టపోయిన రాహుల్.. తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి డబ్బు ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తమ వంశ దైవం అయిన గణేశుడి బంగారు కిరీటం, బంగారు గొలుసులు, తల్లికి చెందిన 12 బంగారు గాజులు, ఇతర నగలు ఎత్తుకెళ్లాడు. ఇప్పుడు మళ్లీ నెఫ్ట్ ద్వారా కోటి రూపాయలు తన అకౌంట్‌లోకి వేసుకున్నాడు. ఇదే విషయంపై బాధిత పేరెంట్స్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాహుల్ దౌండ్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై చీటింగ్, క్రిమినల్ కేసులు పెట్టారు. అతని బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అసలెందుకు ఇలా చేస్తున్నాడనే దానిపై విచారణ జరుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..