దూసుకొస్తున్న “నిసర్గ”

|

Jun 01, 2020 | 5:30 PM

మరో తుఫాన్ ముంచుకొస్తోంది. సూపర్‌ సైక్లోన్‌ అంపన్‌ కొద్ది రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలలో విధ్వంసం సృష్టించి వెళ్లిపోయింది. ఇప్పుడు అంతకంటే వేగంగా మరో అలజడి సృష్టించేందకు సిద్దమవుతోంది. అగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ పరిశోధనా శాఖ(ఐఎండీ) అధికారులు తెలిపారు. కాగా ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారి, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిసర్గ అని పిలుస్తున్న ఈ తుపాను జూన్‌ 3 సాయంత్రానికి దక్షణ […]

దూసుకొస్తున్న నిసర్గ
Follow us on

మరో తుఫాన్ ముంచుకొస్తోంది. సూపర్‌ సైక్లోన్‌ అంపన్‌ కొద్ది రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలలో విధ్వంసం సృష్టించి వెళ్లిపోయింది. ఇప్పుడు అంతకంటే వేగంగా మరో అలజడి సృష్టించేందకు సిద్దమవుతోంది. అగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ పరిశోధనా శాఖ(ఐఎండీ) అధికారులు తెలిపారు. కాగా ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారి, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిసర్గ అని పిలుస్తున్న ఈ తుపాను జూన్‌ 3 సాయంత్రానికి దక్షణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర తీరాలను తాకవచ్చని వాతావరణ పరిశోధనా శాఖ అధికారులు తెలిపారు.