Rain Alert: చల్ల చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్.. ఇకపై కుండబోత వానలే

గ్రీష్మంతో మాడుతున్న దేశానికి చల్లని కబరు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ నైరుతి రుతుపవనాలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. మరి తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఎప్పుడు పలకరించనున్నాయి…? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Rain Alert: చల్ల చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్.. ఇకపై కుండబోత వానలే

Updated on: May 24, 2025 | 1:32 PM

దేశ ప్రజలకు చల్లని కబురు ఐఎండీ అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ ఏడాది 8 రోజుల ముందగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ చెప్పింది. 16 ఏళ్ల తర్వాత ముందుగానే కేరళకు రుతుపవనాలు వచ్చేశాయ్. ఇక జూన్‌ 1న తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రానున్నాయి. గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ ఈ ఏడాది 8 రోజులు ముందుగానే వచ్చేశాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.

రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో గాలులు, ఉరుములతో ఈ వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు కేరళకు ఇంత తర్వగా రావడం గడిచిన 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిగా 2009లో, అంతకుముందు 2001లో ఇంత త్వరగా వచ్చాయి. ఇక చరిత్ర చూసుకుంటే.. 1918లో మే 11 నాటికే రుతుపవనాలు ఎంటర్ అయ్యాయి. 1972లో అత్యంత ఆలస్యంగా జూన్ 18న ప్రవేశించడం గమనార్హం.

అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.. రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో గాలులు, ఉరుములతో ఈ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఇవాళ గరిష్టంగా ఆదిలాబాద్‌లో 33.8, కనిష్టంగా నిజామాబాద్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.. ఇక ఏపీలోని ఇవాళ అల్లూరి, మన్యం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది.