మిక్సోపతికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టిన వైద్యులు.. ఫిబ్రవరి 1 నుండి ఐఎంఏ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

| Edited By: Ravi Kiran

Jan 30, 2021 | 11:59 AM

ఆధునిక వైద్య వృత్తిని పునరుద్ధరించడానికి మిక్సోపతికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళనకు సిద్దమవుతోంది.

మిక్సోపతికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టిన వైద్యులు.. ఫిబ్రవరి 1 నుండి ఐఎంఏ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
Follow us on

IMA relay hunger strike : దేశంలో ‘మిక్సోపతి’ వైద్య విధానం అమలుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆధునిక వైద్య వృత్తిని పునరుద్ధరించడానికి మిక్సోపతికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళనకు సిద్దమవుతోంది. ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 14 వరకు రిలే నిరాహార దీక్ష ప్రారంభించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఎంఏ సభ్యులను, వైద్యులను కోరింది. దేశ వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ఐఎంఏ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆయుర్వేదం, సిద్ధ, హోమియోపతి డాక్టర్లు కూడా 56 రకాల శస్త్ర చికిత్సలు చేయవచ్చని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. అల్లోపతి, ఆయుర్వేదం, సిద్ధ, హోమియోపతి వైద్యాల ను సమన్వయపరుస్తూ ‘మిక్సోపతి’ వైద్య విధానంలో చికిత్స అందించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ విధానం వైద్యరంగానికి పెనుప్రమాదం తెచ్చి పెడుతుం దని వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం నిర్ణయా న్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు భారత వైద్య సంఘం ప్రకటించింది.

Read Also… నిలకడగా సౌరవ్ గంగూలీ ఆరోగ్యం.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చిన వైద్యులు