Video Viral: వరుణుడి మీద కోపం..వరదలోనే పరుపు వేసుకుని నిద్రిస్తున్నాడు..నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది

|

May 18, 2022 | 4:20 PM

అస్సాంలో వ‌ర‌ద‌లు విళ‌య తాండ‌వం సృష్టిస్తున్నాయి. విప‌రీతంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు వ‌ర‌ద‌ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Video Viral: వరుణుడి మీద కోపం..వరదలోనే పరుపు వేసుకుని నిద్రిస్తున్నాడు..నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది
Flood Video
Follow us on

అస్సాంలో వ‌ర‌ద‌లు విళ‌య తాండ‌వం సృష్టిస్తున్నాయి. విప‌రీతంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు వ‌ర‌ద‌ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో పలు చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. త్రిపుర, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. 26 జిల్లాల్లో 4,03,352 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇదేం నిద్రరా బాబు అంటూ అవాక్కై చూస్తున్నారు. ఇంతకీ అదేంటంటే..

ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ప్రవాహంలో ఒక వ్యక్తి నీటిలోనే పరుపు వేసుకుని హాయిగా పడుకున్నట్టు ఇక్కడ మనం వీడియోలో చూడొచ్చు. అయితే, వాస్తవంగా ఈ వీడియో అస్సాంకి చెందినది కాదట. అసలు మన ఇండియాకు చెందినది అసలే కాదంటున్నారు. మలేషియాలోని జోహార్ బహ్రులో గతేడాది జనవరిలో వచ్చిన వర్షాలు,వరదల టైమ్‌లో తీసిందట ఈ వీడియో..కానీ, ప్రస్తుతం అస్సాం వరదల నేపథ్యంలో వీడియో మరోమారు వైరల్‌ అవుతోంది. ఇకపోతే, ఇక్కడ వరదలో నిద్రపోతున్న వ్యక్తి పేరు ముహమ్మద్ ఫారిస్ సులైమాన్‌గా తెలిసింది. 2021 లో వచ్చిన వరదల కారణంగా సులైమాన్ ఇల్లు నీట మునిగిపోయింది. దీంతో కోపంతో అతడు బయటే నిద్రించాడు. అతడు అలా నిద్రపోతుండగా తన తల్లి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది కాస్తా వైరల్ అయ్యింది. చుట్టూ మోకాళి లోతు నీరు చేరి ఉన్నప్పటికీ అతడు ఏమాత్రం పట్టనట్టుగానే నిద్రపోతున్నాడు. ఇది చూసి నెటిజనులు అవాక్కవుతున్నారు. వీడియో అస్సాంకు చెందినదిగా రీట్విట్‌ చేస్తున్నారు. దాంతో వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇలాంటి సీన్‌ గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, అస్సాం వాతావ‌ర‌ణ శాఖ తాజాగా మరో హెచ్చరిక చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని చెప్పింది.