Rajasthan plane crash: రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌.. స్పాట్‌లోనే పైలట్‌ మృతి!

రాజస్థాన్‌లో మరో విమాన ప్రమాదం జరిగింది. చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్‌ జెట్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో పైలట్‌ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం శిథిలాల్లోంచి పైలట్‌ మృతదేహన్ని బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు.

Rajasthan plane crash: రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌.. స్పాట్‌లోనే పైలట్‌ మృతి!
Fighter Jet Crash

Updated on: Jul 09, 2025 | 4:24 PM

ఈ మధ్య కాలంలో తరచూ విమాన ప్రమాదాలు జరగడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే గుజరాత్‌లో విమాన ప్రమాదం జరిగిన మాజీ సీఎం సహా 241 మంది ప్రయాణికులు, 33 మంది స్థానిక ప్రజలు చనిపోవడం యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటన నుంచి తేరుకోక ముందే రాజస్థాన్‌లో బుధవారం మరో విమాన ప్రమాదం వెలుగు చూసింది. చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్‌ జెట్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో పైలట్‌ అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం శిథిలాల్లోంచి పైలట్‌ మృతదేహన్ని బయటకు తీసి.. గాయపడిన వారికి హాస్పిటల్‌కు తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  ఇలా యుద్ధవిమానాలు కూలి పోవడం ఈ ఏడాదిలో ఇది మూడో ఘటన. గతంలో హర్యానాలోని పంచకులలో మార్చి 7న ఒక ప్రమాదం జరగగా, ఏప్రిల్ 2వ తేదీన గుజరాత్‌లో జామ్‌నగర్‌లో ఓ యుద్ధ విమానం నేల కూలింది. ఈ ప్రమాదంలోనూ ఈ ప్రమాదాల్లోనూ ఇద్దరు పైలట్‌లు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

అయితే తరచూ ఇలా ప్రమాదాలు జరగడానికి సాంకేతిక లోపాలే కారణమని అధికారులు భావిస్తున్నారు. దీనిలో పాటు పాత విమానాలను ఇంక సర్వీస్‌ ఉంచి.. వాటిని వినియోగించడం కూడా ఈ ప్రమాదాలకు కారణం కావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 

 

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.