పేడలో పుట్టా.. కరోనా నా దరిదాపుకు కూడా రాదు: మంత్రి

''కరోనా రాకుండా ఉండాలంటే ఆల్కాహాలు తాగాలి''.. ''బురదలో కూర్చొని శంఖం పూరిస్తే కరోనా రాదు''.. ''గోమూత్రం తాగండి

పేడలో పుట్టా.. కరోనా నా దరిదాపుకు కూడా రాదు: మంత్రి

Edited By:

Updated on: Sep 08, 2020 | 1:38 PM

MP Minister on Corona: ”కరోనా రాకుండా ఉండాలంటే ఆల్కాహాలు తాగాలి”.. ”బురదలో కూర్చొని శంఖం పూరిస్తే కరోనా రాదు”.. ”గోమూత్రం తాగండి. కరోనాకు దూరంగా ఉండండి” .. ”కరోనా రాకుండా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి పాపడ్‌లు తినండి” ఇలా కొంతమంది రాజకీయ నాయకులు సొంత సలహాలను ఇచ్చి హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అలా ఇచ్చిన వారిలో కొంతమందికి ఈ వైరస్ సోకింది.

ఇదిలా ఉంటే తాజాగా మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తి దేవీ.. కీలక కామెంట్లు చేశారు. ఇమర్తి దేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందంటూ ఇటీవల వార్తలు రాగా.. వాటిపై ఆమె స్పందించారు. తాను పేడ, మట్టిలో పుట్టానని.. కరోనా తన దరిదాపుకు కూడా రాదని ఇమర్తి దేవి అన్నారు. ”నాకు కరోనా ఉన్నట్లు మీరు చెబుతున్నారు. నేను మట్టి, పేడలో పుట్టా. కరోనా నా దరిదాపుల్లోకి కూడా రాదు” అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More:

నటికి కాంగ్రెస్ నేత క్షమాపణలు.. వివాదం ముగిసినట్లేనా!

జయప్రకాష్‌ రెడ్డి మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం