MP Nusrat Jahan:తృణమూల్ కాంగ్రెస్ తోనే నా ప్రయాణం, ఆ పార్టీకి విధేయురాలిని, ఎంపీ నుస్రత్ జహాన్

తను తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి విధేయురాలైన సైనికురాలినని ఈ పార్టీ లోక్ సభ ఎంపీ నుస్రత్ జహాన్ తెలిపారు. నేను ఎప్పటికీ ఈ పార్టీలోనే కొనసాగుతానని, దీనికోసం కృషి చేస్తానని

MP Nusrat Jahan:తృణమూల్ కాంగ్రెస్ తోనే నా ప్రయాణం, ఆ పార్టీకి విధేయురాలిని, ఎంపీ నుస్రత్ జహాన్

Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 20, 2021 | 11:28 AM

MP Nusrat Jahan: తను తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి విధేయురాలైన సైనికురాలినని ఈ పార్టీ లోక్ సభ ఎంపీ నుస్రత్ జహాన్ తెలిపారు. నేను ఎప్పటికీ ఈ పార్టీలోనే కొనసాగుతానని, దీనికోసం కృషి చేస్తానని ఆమె చెప్పారు. తన ఫ్రెండ్, నటుడు యాష్ దాస్ గుప్తా ఈ మధ్య బీజేపీలో చేరిన అనంతరం ఆమె ఇలా స్పందించడం ఇదే మొదటిసారి. బెంగాలీ నటుడైన దాస్ గుప్తా ఈ నెల 17 న పలువురు ఇతర సినీ, టీవీ నటీనటులతో బాటు బీజేపీలో చేరారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసి నుంచి అనేకమంది కమలం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇతని ఎంట్రీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి కూడా.. బహుశా అందువల్లే బీజేపీ పలువురు సినీ, టీవీ స్టార్స్ ను చేర్చుకుంటోంది. నుస్రత్ జహాన్, దాస్ గుప్తా ఇద్దరూ ఇటీవల రాజస్థాన్ వెళ్లినట్టు వచ్చిన వార్తలు వీరు డేటింగ్ చేస్తున్నారనే ఊహాగానాలకు బలం చేకూర్చాయి.

బిజినెస్ మన్ అయిన నిఖిల్ జైన్ ని నుస్రత్ 2019 లో వివాహం చేసుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య కలతలు రేగినట్టు సమాచారం. కాగా తన ఫ్రెండ్ నుస్రత్ తృణమూల్ లోనే కొనసాగినా, తాను బీజేపీలో చేరినా అందులో ఆశ్చర్యమేముందని  దాస్ గుప్తా ప్రశ్నించాడు. ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీలకు చెందినవారు లేరా అని కూడా ఆయన అన్నాడు. తను బీజేపీలో చేరడం అసాధారణమేమీ కాదని చెప్పారు.

 

Also Read:

TV Actor Found Dead Suspect: స్నేహితుడి ఇంట్లో శవమై కనిపించిన టీవీ నటుడు.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..

Vijay Hazare Trophy 2021 : క్రికెట్ అభిమానులకు పండగే పండగ.. నేటి నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ.. ఆరు జట్ల మధ్య హోరాహోరి పోరు..