AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం..ఏకాంతంగా గడిపేందుకు ఆ బిల్డింగ్ వద్దకు.. తీరా వెళ్లాక

పాతబస్తీ డబీర్​పురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి శృంగారం కోసం...గ్రైండర్​ అనే డేటింగ్​ యాప్​ను ఉపయోగించేవాడు. జనవరి 19వ తేదీన ఆ యాప్‌లో అతనికి మరో గుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరు చాటింగ్​ చేసుకున్న తర్వాత ఏకాంతంగా గడిపేందుకు ఓ ప్రాంతాన్ని ఫిక్స్ చేశారు. తీరా అక్కడికి వెళ్లాక..

Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం..ఏకాంతంగా గడిపేందుకు ఆ బిల్డింగ్ వద్దకు.. తీరా వెళ్లాక
Building Construction (Representative image)
Ram Naramaneni
|

Updated on: Feb 06, 2025 | 8:37 AM

Share

డేటింగ్​ యాప్​ ద్వారా పరిచయం అయిన వ్యక్తిని నిర్మాణంలో ఉన్న భవనంపైకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఏటీఎం కార్డును లాక్కున్న వ్యక్తి….40వేలు విత్​ డ్రా చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు మొదలెట్టిన పోలీసులకు డెకాయిట్ గ్యాంగ్‌లోని ఐదుగురు సభ్యులు పట్టుబడ్డారు.

పాతబస్తీ డబీర్‌పురకు చెందిన ఓ వ్యక్తి గ్రైండర్​ అనే డేటింగ్​ యాప్‌ను ఉపయోగించేవాడు. జనవరి 19న గ్రైండర్ యాప్‌ను ఓపెన్ చేశాడు. యాప్‌లో ఓగుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. చాటింగ్‌లో పరస్పరం అంగీకారంతో చార్మినార్​గుర్వాన గల్లీ దగ్గరకు చేరుకున్నారు. అక్కడే నిర్మాణంలో ఉన్న భవనంపైకి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మరో నలుగురు కాపుకాశారు. అంతా కలిసి క్షణాల్లో ఆవ్యక్తిని చుట్టుముట్టి కత్తులతో బెదిరించి దోచుకున్నారు. మలక్​పేట్​లోని ఓ ఏటీఎం సెంటర్​ నుంచి రూ.40వేల నగదును డ్రా చేశారు.

షాక్‌కు గురైన బాధితుడు.. తేరుకుని ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మలక్​పేట్​ ఏటీఎం సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఫలక్​నుమా, మొఘల్​పురా సైదాబాద్​ కాలనీకి ప్రాంతాలకి చెందిన 25 ఏళ్లు లోపు వ్యక్తులుగా గుర్తించారు.  ఫిర్యాదు అందిన నాలుగు రోజుల్లో కేసును చేధించిన మీర్‌పేట్ పోలీసులను సౌత్​జోన్​ డీసీపీ స్నేహ మెహ్రా అభినందించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి