Marriage: పెళ్లైన సంతోషంలో వరుడు.. రెండు నెలలైనా తాకనివ్వని భార్య.. అసలు విషయం తెలిసి బిత్తరపోయిన భర్త..

| Edited By: Anil kumar poka

Jun 24, 2021 | 10:13 PM

Marriage: ఏ యువతీ, యువకుడికి అయినా పెళ్లి అంటే తెగ సంబరపడిపోతుంటారు. యువతీ, యువకుల జీవితంలో పెళ్లి అనేది ఒక కీలక ఘట్టం, జీవితంలో...

Marriage: పెళ్లైన సంతోషంలో వరుడు.. రెండు నెలలైనా తాకనివ్వని భార్య.. అసలు విషయం తెలిసి బిత్తరపోయిన భర్త..
Wife And Husband
Follow us on

Marriage: ఏ యువతీ, యువకుడికి అయినా పెళ్లి అంటే తెగ సంబరపడిపోతుంటారు. యువతీ, యువకుల జీవితంలో పెళ్లి అనేది ఒక కీలక ఘట్టం, జీవితంలో ఒక కీలక మలపుకు నాందిగా భావిస్తుంటారు. పెళ్లి తరువాత.. దంపతుల మధ్య సాన్నిహిత్యం, శారీరక సంబంధమే వారి బంధాన్ని మరింత ధృడపరుస్తుంది. అలాంటిది పెళ్లి అయిన తరువాత.. భార్య, భర్తల మధ్య కనీస సాన్నిహిత్యం లేకపోతే పరిస్థితి ఏంటి. ఒకే ఇంట్లో ఉంటూ.. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా నెలల తరబడి అలా ఒకరికొకరు కలుసుకోకుండా, మాట్లాడకుండా ఉంటే వారి పరిస్థితి ఏంటి?. ఇలాంటి పరిస్థితినే ఓ వ్యక్తి ఎదుర్కొన్నాడు. చివరికి అసలు విషయం తెలుసి బిత్తరపోయాడు. తన భార్య కాపురానికి సెట్ కాదని గ్రహించి షాక్ అయ్యాడు. తనన మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. కాన్పూరు నగరానికి చెందిన యువకుడికి, శాస్త్రినగర్‌లోని పంకి ప్రాంతానికి చెందిన యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఏప్రిల్ 28వ తేదీన వీరి వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్నాక భార్యా భర్తల మధ్య శారీరక సంబంధం సాధారణం. అయితే, ఆ యువతి మాత్రం తన భర్తను కనీసం దగ్గరకు కూడా రానీయలేదు. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా రెండు నెలల నుంచి కనీసం తాకనివ్వకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను వైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. అతని భార్యను పరీక్షించిన వైద్యులు.. ఆమె హిజ్రా అని తేల్చారు. అదే విషయాన్ని భర్తకు తెలియజేశారు. దాంతో అతను షాక్ అయ్యాడు. తనను మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు. లింగ మార్పిడి చేసి అమ్మాయి అని చెప్పి తనతో వివాహం జరిపించారంటూ భార్య తరఫు బంధువులపై కేసు పెట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. అతని అత్తమామలతో పాటు ఎనిమిది మందిపై ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Also read:

వినియోగదారులకు అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్.. మారనున్న పలు అంశాలు.. గ్యాస్.. బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం..

Indian Driving License: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు అయ్యే దేశాలు ఏంటో తెలుసా..? ఆ నిబంధనలు తప్పనిసరి

Different Marriage : అక్కడ జరిగే పెళ్లి తంతే వేరు.. ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలా..వైరల్ వీడియో.