సరిహద్దు వెంట శుక్రవారం తెల్లవారు జామున టెన్షన్ వాతావరణం నెలకొంది. కుప్వారా జిల్లాలోని మంచల్ సెక్టార్ సమీపంలో సరిహద్దు ఇవతల ఓ అనుమానితుడి కదలికలను ఆర్మీ గుర్తించింది. తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు జవాన్లు. చీనార్ కాప్స్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారు జామున మంచల్ సెక్టార్ సమీపంలోని సరిహద్దు ప్రాంతం ఇవతల ప్రాంతంలో ఓ అనుమానితుడు సంచరించాడు. అది గమనించిన సైన్యం వెంటనే కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో మూడు ఏకే-47 రైఫిల్స్, ఓ స్నిప్పర్ రైఫిల్, 8 గ్రేనేడ్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
3 AK rifles, a sniper rifle, 8 grenades & other warlike stores were recovered. Search in progress: Chinar Corps, Indian Army https://t.co/tucLKHxJue
— ANI (@ANI) July 31, 2020
Read More
కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తైవాన్ మాజీ అధ్యక్షుడు ఇక లేరు