‘మీ తండ్రి లాలూజీ ఎలా ఉన్నారు’ ? కుల గణన మీటింగ్ లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో ప్రధాని మోదీ

| Edited By: Phani CH

Aug 23, 2021 | 5:59 PM

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ..ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ని పదేపదే ప్రశ్నించారు. కుల ప్రాతిపదికన సెన్సస్ జరగాలని కోరుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యాన తనను కలుసుకున్న ప్రతినిధి బృందంలోని తేజస్వి యాదవ్ ని ఆయన ఇలా ప్రశ్నించడంతో అంతా ఆశ్చర్యపోయారు.

మీ తండ్రి లాలూజీ ఎలా ఉన్నారు ? కుల గణన మీటింగ్ లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో ప్రధాని మోదీ
Modi
Follow us on

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ..ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ని పదేపదే ప్రశ్నించారు. కుల ప్రాతిపదికన సెన్సస్ జరగాలని కోరుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యాన తనను కలుసుకున్న ప్రతినిధి బృందంలోని తేజస్వి యాదవ్ ని ఆయన ఇలా ప్రశ్నించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ బృందంలో లాలూ ప్రసాద్ యాదవ్ లేరు.. 73 ఏళ్ళ ఆయన వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. కిడ్నీ, గుండె జబ్బులతో బాధ పడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ లోగడ ఢిల్లీ లోని ఎయిమ్స్ లోను ఝార్ఖండ్ రాజధాని రాంచీ జైలు ఆసుపత్రిలోను చాలా రోజులు చికిత్స పొందారు. లాలూ త్వరగా కోలుకోవాలని తాను కోరుతున్నట్టు మోదీ చెప్పారు. ఇక బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మంజీని కూడా మోదీ సరదాగా ‘ఆట పట్టించారు’. మీరు మాస్క్ ధరించి ఉన్నారని..అందువల్ల మీ చిరునవ్వు ముఖాన్ని (స్మైలింగ్ ఫేస్) ని చూడలేకపోతున్నానని’ చమత్కరించారు. దీనికి నితీష్ కుమార్ కూడా అలాగే స్పందిస్తూ..పబ్లిక్ లో ఉన్నప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మీరే చెప్పారు కదా’ అని కౌంటర్ ఇచ్చారు. ఆ తరువాత మీటింగ్ అసలు విషయమైన కుల గణనపై ప్రారంభమైంది.

కాస్ట్ సెన్సస్ జరగాలన్న తమ డిమాండుకు మోదీ సానుకూలంగా స్పందించినట్టు ఆ తరువాత నితీష్ కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియ నిర్వహణలో ఇప్పటికే జాప్యం జరిగిందని తాము చెప్పామన్నారు. మా రాష్ట్రంలో వెనుకబడిన కులాలవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అసలు మొత్తం దేశానికంతటికీ వర్తించేట్టు దీన్ని నిర్వహించాలని మేము కోరాం అని ఆయన వెల్లడించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Karvy MD Parthasarathi: కార్వీ ఎండీ పార్థసారధి కేసులో తవ్వేకొద్ది వెలుగులోకి వస్తున్న పాపాల పుట్ట..!

‘ఆగస్టు 31 డెడ్ లైన్ దాటారో.. అది మీకు రెడ్ లైనే’.. అమెరికా, బ్రిటన్ దేశాలకు తాలిబన్ల హెచ్చరిక