Ranya Rao: కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ట్విస్ట్‌లు

బెంగళూర్‌లో కన్నడ హీరోయిన్‌ రన్యా రావు బంగారం స్మగ్లింగ్‌ కేసులో పట్టుబడడం సంచలనం రేపింది. దుబాయ్‌ నుంచి బెంగళూర్‌కు 15 కేజీల బంగారన్ని స్మగ్లింగ్‌ చేస్తూ DRI అధికారులకు పట్టుబడ్డారు రన్యా రావు. దుస్తుల్లో గోల్డ్‌ను స్మగ్లింగ్‌ చేస్తూ ఆమె దొరికిపోయారు. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల ప్రమేయం ఉండడం కూడా సంచలనం రేపుతోంది. తాజా రన్యా రావు వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Ranya Rao: కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ట్విస్ట్‌లు
Ranya Rao

Updated on: Mar 05, 2025 | 12:45 PM

కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయ్‌. దుబాయ్‌ నుంచి బెంగళూర్‌కి గోల్డ్‌ స్మగ్లింగ్‌ వెనక ప్రముఖుల పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సీనియర్‌ IPS అధికారి అయిన రన్యారావు సవతి తండ్రికి ఈ కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. IPS అధికారైన రన్యారావు సవతి తండ్రిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు DRI అధికారులు. రన్యారావుకు ఎస్కార్ట్‌గా వచ్చిన పోలీసులపై దృష్టిపెట్టిన DRI.. గోల్డ్‌ స్మగ్లింగ్‌లో ఎవరెవరి పాత్ర ఉందనేదానిపై ఆరా తీస్తున్నారు. మనీలాండరింగ్‌ కోణంలోనూ రన్యారావును ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు DRI అధికారులు. తాజాగా  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బుధవారం ఆమె ఇంట్లో సోదాలు చేసి.. కోట్లాది రూపాయల విలువైన భారీ నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. రూ.2.06 కోట్ల విలువైన బంగారం, రూ.2.67 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేుకున్నారు.

15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ నిన్న బెంగళూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది రన్యారావు.  రన్యారావుకి 14రోజుల రిమాండ్‌ విధించింది బెంగళూరు కోర్టు. విదేశాల నుంచి ఢిల్లీ మీదుగా బెంగళూరుకి గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం ప్రస్తుతం కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. 15రోజుల్లో నాలుగుసార్లు బెంగళూర్‌ నుంచి దుబాయ్‌ వెళ్లొచ్చినట్టు గుర్తించారు DRI అధికారులు. ఒక్కోసారి 7 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌ వెళ్లొచ్చింది రన్యారావు. రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ వెనక పలువురు పెద్దల పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ప్రతిసారీ బెంగళూర్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి పోలీస్‌ సెక్యూరిటీతో ఇంటికి వెళ్లింది రన్యారావు.పైగా, తాను డీజీపీ కూతురునని చెబుతూ తనిఖీల నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌కి.. ఆమె సవతి తండ్రి అయిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇప్పుడు సంచలనం రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..