
ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు జరిగింది. పహల్గామ్ దాడికి ఇంకెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారు, ఇంత ఆలస్యమా అని ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుకుంటున్న టైమ్ అది. బట్.. ఆ గ్యాప్‌లో భారత్ రచించిన యుద్ధతంత్రం వింటే.. మైండ్ బ్లాంక్ అవుతుందంతే. ముందుగా భారత గగనతలంలోకి పాక్ విమానాలకు ఎంట్రీ లేకుండా నిషేధం ప్రకటించాం. కీలకమైన ప్రదేశాల్లో జీపీఎస్ జామర్లను ఇన్‌స్టాల్ చేశాం. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్.. అమెరికన్ జీపీఎస్ వాడుతుంది. పాక్ ఆయుధాలన్నీ చైనావే. ఆ చైనా జీపీఎస్ వాడదు. బీడో వాడుతుంది. సో, జీపీఎస్, బీడోను జామ్ చేయగల జామర్లను పెట్టాం. పాకిస్తాన్ గైడెడ్ మిస్సైల్ కాదు కదా బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించినా పనిచేయని విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాం. ఆ తరువాత.. ఆపరేషన్ సింధూర్‌తో విరుచుకుపడ్డాం. అచ్చంగా ఇలాంటి ఆపరేషన్‌నే మే 10వ తేదీన చేపట్టాం. ఇదంతా ఆపరేషన్ సింధూర్‌లో భాగమే అయినా.. దాన్ని ఆపరేషన్ డికాయ్ అనాలేమో..! అసలు ఆట ఆరోజే జరిగింది. ప్రత్యర్థి కనీసం ఊహించనుకూడా ఊహించని రీతిలో పర్ఫెక్ట్ టైమింగ్‌తో జామర్స్ వాడి.. జస్ట్ 23 నిమిషాల్లోనే పీవోకే, పాకిస్తాన్‌లో దాడులు చేసొచ్చాం. సో.. వాట్ నెక్ట్స్. పాకిస్తాన్ కచ్చితంగా అటాక్ చేస్తుందని తెలుసు మనకి. రెడీగా ఉన్నాం మనం. అనుకున్నట్టుగానే చైనా యుద్ధవిమానాలను, తుర్కియే డ్రోన్లను వాడింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. వాటిని ఎలా తిప్పికొట్టామన్నది చాలా ఇంట్రస్టింగ్...