హాథ్రస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని ఓ మగ పోలీసు చేయి పట్టుకుని నిలువరించిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.. ఉత్తరప్రదేశ్ పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.. కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఈ ఘటనపై బీజేపీ మహిళా నేతలు కూడా మండిపడుతున్నారు.. ఓ మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి ఆ పోలీసుకు ఎంత ధైర్యం అని మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్రా వాగ్ ఆగ్రహించారు.. భారత సంస్కృతీ సంప్రదాయాలపై నమ్మకం ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.. ఆ దాష్టికానికి పాల్పడిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.. పోలీసులు పరిధి దాటి ప్రవర్తించకూడదని హితవు చెప్పారు.. ఇప్పటికే జరిగిన తప్పిదానికి గౌతమ్‌బుద్ధ్ నగర్ పోలీసులు ప్రియాంకగాంధీకి క్షమాపణలు తెలిపారు.. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు..
#Maharashtra BJP Leader Chitra Kishor Wagh Slams UP Police for Manhandling Priyanka Gandhi Vadra.@ChitraKWagh @PemaKhanduBJP @KirenRijiju https://t.co/FuJfggpRJB
— Northeast Today (@NorthEastToday) October 5, 2020