Corona Virus: కరోనా వైరస్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. హోలీ పండుగకు అనుమతులు నిరాకరణ..

|

Mar 25, 2021 | 2:34 AM

Holi 2021: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చి తగ్గుముఖం పడితే.. భారత్‌లో మాత్రం..

Corona Virus: కరోనా వైరస్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. హోలీ పండుగకు అనుమతులు నిరాకరణ..
Holi 2021
Follow us on

Holi 2021: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చి తగ్గుముఖం పడితే.. భారత్‌లో మాత్రం సెకండ్ వేవ్ ఇప్పుడే మొదలైంది. తాజాగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో ముఖ్యంగా హర్యానాను చెప్పుకొవచ్చు. రాష్ట్రంలో చాలా రోజుల తరువాత మళ్లీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసుతుండటంతో.. వైరస్ కట్టడికి చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఈ నెల 28 జరగే హోలీ పండుగపై ఆంక్షలు విధించింది. హోలీ బహిరంగ వేడుకలను నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ప్రకటించింది.

ఈ మేరకు బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హోలీ పండుగ వేడుకలను అనుమతించేది లేదని సర్కార్ తేల్చి చెప్పింది. రాష్ట్రంలో రోజు రోజుకు విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోక తప్పదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు కూడా కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. మాస్కులు విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శుభ్రంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.

Also read:

COVID-19 Vaccine: కోవిషీల్డ్ Vs కోవాగ్జిన్.. వీటిలో బెస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఏది? సైడ్ ఎఫెక్ట్స్, సమర్థత.. వివరాలు మీకోసం..

India vs England: అంపైర్ల పట్ల గౌరవమే ఉండదు.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేసిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్..

HAL Recruitment 2021: హిందుస్తాన్ ఏరోనాటికల్‌లో భారీగా ఉద్యోగాలు.. ప్రారంభ జీతమే రూ. 40 వేలు.. మీరు దరఖాస్తు చేసుకున్నారా?