HMPV పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 15కు చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్, తమిళనాడులను టచ్ చేసిన HMPV వైరస్.. తాజాగా ఒడిశాను కూడా తాకింది.
దేశంలో HMP వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 15 కేసులు నమోదయ్యాయి. తాజాగా అసోంలో శనివారం(జనవరి 11) తొలి కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 10 నెలల చిన్నారి రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు.
దిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (AMCH)లో చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉంది. చలి జ్వరం వ్యాధి లక్షణాలతో నాలుగు రోజుల క్రితం చిన్నారిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించినట్లు ఏఎంసిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ధృవజ్యోతి భూయాన్ తెలిపారు.
లాహౌల్‌కు చెందిన ICMR-RMRC నుండి పరీక్ష ఫలితాలను స్వీకరించిన తర్వాత HMPV సంక్రమణ నిర్ధారించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఇన్‌ఫ్లుఎంజా, ఫ్లూ సంబంధిత కేసుల్లో పరీక్షల కోసం శాంపిల్స్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు క్రమం తప్పకుండా పంపుతామని భూయాన్ చెప్పారు. ఇది సాధారణ విచారణ అని ఆయన అన్నారు. ఈ సమయంలో HMPV సంక్రమణ గుర్తించామని, ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉంది. ఇది సాధారణ వైరస్, దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు సూపరిండెంట్.
లాహోవల్ (దిబ్రూగర్)లో ఉన్న ICMR ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విశ్వజిత్ బోర్కకోటి మాట్లాడుతూ, 2014 నుండి, దిబ్రూగఢ్ జిల్లాలో 110 HMPV కేసులను గుర్తించామన్నారు. ఈ సీజన్‌లో ఇదే మొదటి కేసు. ఇది ప్రతి సంవత్సరం వెల్లడి అవుతుంది. ఇది కొత్తదేమి కాదన్నారు.
HMPV యొక్క లక్షణాలు ఏమిటి?
జ్వరం
దగ్గు
ముక్కు కారటం
శ్వాసకోశ బాధ
HMPV నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి
చేతులు కడుక్కున్న తర్వాత ఆహారం తినండి.
సోకిన వారితో కాస్త దూరంగా ఉండండి.
దగ్గు, జలుబు, జ్వరం ఉంటే పరీక్షలు చేయించుకోండి.
పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..