ఇది ఆరంభం మాత్రమే..! ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొట్టమొదటి భారతీయ అంధురాలు..

ఇది ఆరంభం మాత్రమే,.. మరిన్ని శిఖరాలను జయించాలన్నది తన కోరికగా వెల్లడించింది. అంధురాలు అయినప్పటికీ, ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మిరాండా హౌస్ నుండి గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ సర్వీస్‌గా ఉద్యోగం చేస్తూ పర్వతారోహణలో తన సత్తా చాటారు.

ఇది ఆరంభం మాత్రమే..! ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొట్టమొదటి భారతీయ అంధురాలు..
Blind Woman To Climb Everes

Updated on: May 25, 2025 | 6:16 PM

ప్రస్తుత కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే..కాళ్లు, చేతులు అన్ని సరిగ్గా ఉండి కూడా కష్టపడి పనిచేయటానికి బద్దకించేవారు ఎక్కువగా ఉన్నారు. అలాగే కొందరు స్వల్ప గాయాలు, చిన్న చిన్న కష్టాలను కూడా తట్టుకోలేకపోతుంటారు. చిన్నపాటి దెబ్బలు, గాయాలకే రోజులు, నెలల తరబడి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ, మన చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు ఈ అందమైన ప్రపంచాన్ని తమ కళ్ళతో చూడలేని వారు కూడా ఉన్నారు. కానీ, అలాంటి వారు తమ వైకల్యాన్ని జయించి, ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం.. తాజాగా చూపులేకపోయినా ఓ గిరిజన మహిళ తన కృషి, పట్టుదల, చదువు, ఆత్మవిశ్వాసంతో ఏకంగా ఎవరెస్ట్ శిఖరాన్ని జయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన గిరిజన మహిళ చోంజిన్ ఆంగ్మో అంధత్వాన్ని అధిగమించి ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ అంధ మహిళగా చరిత్రలో నిలిచారు. కిన్నౌర్‌ జిల్లాకు చెందిన చోంజిన్‌ చాంగో అనే మారుమూల గ్రామంలో నివసిస్తున్నారు. కానీ, ఆమె తన అత్యున్నత ప్రతిభతో ఒక ప్రత్యేకమైన రికార్డును సృష్టించారు. తను పూర్తిగా అంధురాలైనప్పటికీ తన పట్టుదలతో ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కి అక్కడ మన దేశ జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో ఆమె భారతదేశపు మొట్టమొదటి అంధ మహిళా పర్వతారోహకురాలిగా రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. ప్రపంచంలో ఐదవ వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆమె.. హెలెన్ కెల్లర్‌ను ఆదర్శంగా తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

చోంజిన్‌ కేవలం ఎనిమిదేళ్ల వయసులోనే తన దృష్టిని కోల్పోయినట్టుగా తెలిసింది. అయినప్పటికీ ఆమె తన పట్టుదలను వదులుకోలేదు. చోంగ్జిన్ అంగ్మో తన బలహీనతను తన బలంగా మార్చుకున్నారు. తను అనుకున్నది సాధించారు. ఈ సందర్భంగా అంగ్మో మాట్లాడుతూ.. కథ ఇప్పుడే ప్రారంభమైందని చెప్పింది. ఇది ఆరంభం మాత్రమే,.. మరిన్ని శిఖరాలను జయించాలన్నది తన కోరికగా వెల్లడించింది. అంధురాలు అయినప్పటికీ, ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మిరాండా హౌస్ నుండి గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ సర్వీస్‌గా ఉద్యోగం చేస్తూ పర్వతారోహణలో తన సత్తా చాటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..