Watch Video:పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా.. భారీ శబ్ధం.. ఏమైందని చూసేలోపే..

హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. చంబా జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుండగా ఉన్నట్టుండి పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు 40 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

Watch Video:పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా.. భారీ శబ్ధం.. ఏమైందని చూసేలోపే..
Himachal Wedding Tragedy

Updated on: Dec 10, 2025 | 5:13 PM

పెళ్లి వేడుకల్లో భాగంగా నృత్యం చేస్తుండగా అకస్మాత్తుగా ఇంటి పైకప్పు కుప్పకూలి సుమారు 40 మంది గాయపడిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చంబా జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఆచారం ప్రకారం చంబా జిల్లాలో జరుపుకునే సాంప్రదాయ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక నృత్య కార్యక్రమం జరుగుతోంది. ఇంటిపైకప్పు ఎక్కి కొందరు.. కిందనుంచి మరికొందరు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. నృత్యాలు, పాటలతో ఆ ప్రాంతం మొత్తం ఎంతో సందండిగా ఉంది. కానీ ఇంతలోనే ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.

దీంతో ఇంటిపైన, కింద ఉన్న జనాలు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే పైకప్పు కూలడంతో అక్కడున్న బంధువులు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కొందరు మాత్రం ధైర్యం చేసి గాయపడిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

శిథిలాల కింద చిక్కుకున్న వారిని నెమ్మదిగా బయటకు తీసి అంబులెన్స్ సహాయంతో సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. మొత్తం ఈ ప్రమాదంలో సుమారు 40 మంది వరకు గాయపడి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే క్షతగాత్రులంతా ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని.. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

వీడియో చూడండి..


అయితే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.