Viral Video: ఎత్తైన బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ట్రైన్‌.. ఒక్కసారిగా కూలిపోయిన బేస్‌ భాగం.. తర్వాత ఏం జరిగిందంటే?

హిల్‌ స్టేట్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో పెను ప్రమాదం తప్పింది. ఒక ఎత్తైన బ్రిడ్జ్‌పై నుంచి ట్రైన్‌ వెళ్తుండగా.. బ్రిడ్జ్‌ బేస్‌ భాగం ఒక్కసారిగా కూలి నదిలో పడిపోయింది. అయితే ట్రైన్‌కు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఎత్తైన బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ట్రైన్‌.. ఒక్కసారిగా కూలిపోయిన బేస్‌ భాగం.. తర్వాత ఏం జరిగిందంటే?
Rail Bridge Collapse

Updated on: Jul 21, 2025 | 4:49 PM

హిల్‌ స్టేట్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా విరివిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నదులకు భారీగా నీరు చేరుకొని.. వరదలకు సంభవిస్తున్నాయి. అంతే కాకుండా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చక్కి నదిపై ఉన్న రైల్వే వంతెనపై నుంచి ట్రైన్‌ ప్రయాణిస్తుండగా దాని వైబ్రేషన్‌కు ఒక్కసారిగా అ బ్రిడ్జ్‌ బేస్‌ కూలి నదిలో పడిపోయింది.

పఠాన్‌కోట్‌ మీదుగా ఢిల్లీ-జమ్ము మార్గంలో రాకపోకలు సాగించేందుకు కొన్నేళ్ల క్రితం చక్కి నదిపై ఒక ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. ఈ వంతెన నది నుంచి చాలా ఎత్తులో నిర్మించబడి ఉటుంది. అయితే ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చక్కీ నదిలోకి నీరు చేరడంతో వరద పొటెత్తింది. అయితే బ్రిడ్జ్‌ బేస్‌ భాగం నదికి పక్కనే ఉండడంతో వరద ప్రభావానికి బ్రిడ్జి కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. వందలాది ప్రయాణికులతో ఓ రైలు బ్రిడ్జిపై నుంచి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం బేస్‌లో జరగడంతో బ్రిడ్జ్‌తో పాటు, ట్రైన్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.