వణికిపోతున్న హిమాచల్.. భారీ వర్షాలకు 31 మంది మృతి.. 53 రోడ్లు మూసివేత.. మరోసారి ఆరెంజ్ అలర్ట్!

వరుణుడు అలిగాడనుకున్నాడు. రుతుపవనాలు ప్రవేశించినా అలకపాన్పు దిగలేదని ఆందోళనపడ్డారు. కానీ తెలుగు స్టేట్స్‌లో మిస్టర్‌ వరుణ్‌ ఎంట్రీ లేట్‌ అయిందిగానీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే కుమ్మేస్తున్నాడు. సీజన్ స్టార్టింగ్‌ నుంచే కొన్నిచోట్ల విశ్వరూపం చూపిస్తున్నాడు. మొన్నటిదాకా అనావృష్టి ఇప్పుడు అతివృష్టి. కుండపోత వానలతో విలవిల్లాడుతోంది ఉత్తర భారతం.

వణికిపోతున్న హిమాచల్.. భారీ వర్షాలకు 31 మంది మృతి.. 53 రోడ్లు మూసివేత.. మరోసారి ఆరెంజ్ అలర్ట్!
Himachal Pradesh Heavy Rains

Updated on: Jun 28, 2025 | 6:15 PM

వరుణుడు అలిగాడనుకున్నాడు. రుతుపవనాలు ప్రవేశించినా అలకపాన్పు దిగలేదని ఆందోళనపడ్డారు. కానీ తెలుగు స్టేట్స్‌లో మిస్టర్‌ వరుణ్‌ ఎంట్రీ లేట్‌ అయిందిగానీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే కుమ్మేస్తున్నాడు. సీజన్ స్టార్టింగ్‌ నుంచే కొన్నిచోట్ల విశ్వరూపం చూపిస్తున్నాడు. మొన్నటిదాకా అనావృష్టి ఇప్పుడు అతివృష్టి. కుండపోత వానలతో విలవిల్లాడుతోంది ఉత్తర భారతం.

ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్ 20న రుతుపవనాలు వచ్చినప్పటి నుండి జూన్ 27 వరకు హిమాచల్‌లో 31 మంది మరణించారు. నలుగురు తప్పిపోయారు, 66 మంది గాయపడ్డారు. ఇందులో పాము కాటు, నీటిలో మునిగిపోవడం, రోడ్డు ప్రమాదాలు, నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తుల గణాంకాలు ఉన్నాయి.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వారం రోజుల్లో రూ.29.16 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రజా పనుల శాఖ (పిడబ్ల్యుడి) అత్యధికంగా రూ.2 కోట్ల 743.40 లక్షల నష్టం వాటిల్లింది. 6 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా, 8 దెబ్బతిన్నాయి. 7 దుకాణాలు, 8 గోశాలలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. 37 జంతువులు, ఎన్నో పక్షులు కూడా కొట్టుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 53 రోడ్లు ట్రాఫిక్ కోసం మూసివేశారు. దీంతో పాటు, 135 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 147 తాగునీటి పథకాలు నిలిచిపోవడం వల్ల వేలాది మంది ప్రజల జీవితాలు ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో గరిష్ట నష్టం కులు జిల్లాలో నమోదైంది. ఇక్కడ 23 రోడ్లు మూసివేశారు.

నిర్మండ్, అని సబ్ డివిజన్లలో నీటి సరఫరా, విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 74 ట్రాన్స్‌ఫార్మర్లు, 118 తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. మండి జిల్లాలో 16 రోడ్లు మూసివేశారు. 59 ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయడం లేదు. కిన్నౌర్‌లో 33 తాగునీటి పథకాలు ప్రభావితమయ్యాయి. ఇక, జూలై 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా జూన్ 29న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాబోయే 24 గంటల్లో సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు నదులు, కాలువలకు దూరంగా ఉండాలని, జాగ్రత్తగా వహించాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..