క్రీడాకారులకు నాసిరకం భోజనాన్ని పెడుతున్న సాయ్‌

అంతటా అవినీతే! ఆఖరికి క్రీడాకారులకు అన్నం పెట్టే చోట కూడా కాసుల కక్కుర్తే! ఇక పతకాలు ఎలా వస్తాయి? పాటియాలాలోని నేతాజీ సుభాష్‌ జాతీయ క్రీడాసంస్థ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది..

క్రీడాకారులకు నాసిరకం భోజనాన్ని పెడుతున్న సాయ్‌

Updated on: Sep 09, 2020 | 1:05 PM

అంతటా అవినీతే! ఆఖరికి క్రీడాకారులకు అన్నం పెట్టే చోట కూడా కాసుల కక్కుర్తే! ఇక పతకాలు ఎలా వస్తాయి? పాటియాలాలోని నేతాజీ సుభాష్‌ జాతీయ క్రీడాసంస్థ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.. వచ్చిన డబ్బును అక్కడి అధికారులు సుష్టుగా భోంచేసి క్రీడాకారులకేమో నాసిరకం భోజనానికి పెడుతున్నారు.. మొన్నీమధ్యనే అక్కడి సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించడం లేదన్న వార్త బయటకు వచ్చింది.. అదే కాకుండా ఇద్దరు బాక్సర్లు క్వారంటైన్‌ నిబంధనలను బ్రేక్‌ చేశారంటూ కూడా మీడియాలో కథనాలు వచ్చాయి.. ఇక ఇప్పుడేమో అథ్లెట్లకు సరైన తిండి కూడా పెట్టడం లేదనే విషయం బయటకు వచ్చింది.. భారత స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.. అసలు వంటగది మొత్తం అపరిశుభ్రంగా ఉంటుందట! ఆహార నాణ్యత కూడా అంతంత మాత్రమేనట! అథ్లెట్లకు పౌష్టికాహారాన్ని పెట్టాల్సిన అధికారులు కాసుల కక్కుర్తికి ఇంత దరిద్రానికి పాల్పడుతున్నారు. మొన్న హిమదాస్‌కు పెట్టిన భోజనంలో వెంట్రుకలు, గోళ్లు వచ్చాయట! వెంటనే ఆమె ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు దృష్టికి తీసుకెళ్లింది.. తనకు పెట్టిన తిండి ఫోటోలను కూడా తీసి వాటిని ఎన్‌ఐఎస్‌ పాలక అధికారులకు పంపింది..
ఈ విషయాన్ని కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజుజు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.. భారత స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులను లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ తీసుకున్నారు.. జాతీయ క్రీడా సంస్థలోని కిచెన్‌ అపరిశుభ్రంగా ఉండటం, నాసిరకమైన ఆహారాన్ని క్రీడాకారులకు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు.