Hilsa Fish: బంగ్లాదేశ్‌ నుంచి మళ్లీ ‘పద్మా పులస’ రాక..! దుర్గా నవరాత్రి ఉత్సవాలకు స్పెషల్‌ గిఫ్ట్..

|

Sep 22, 2023 | 8:19 AM

గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారత్‌కు పద్మా పులస (హిలస) ఎగుమతికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అంగీకరించింది. దసరా పండుగ సీజన్‌కు ముందుగా దాదాపు 3,950 మిలియన్‌ టన్నుల పద్మా పులస భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయులకు ముఖ్యంగా బెంగాళీలకు ఈ మేరకు బంగ్లాదేశ్‌ తీపి కబురు చెప్పింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ పద్మా పులసను బెంగాలీలు చాలా ప్రత్యేకం. బెంగాల్‌లో దేశీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. దసరా పండుగ..

Hilsa Fish: బంగ్లాదేశ్‌ నుంచి మళ్లీ ‘పద్మా పులస’ రాక..! దుర్గా నవరాత్రి ఉత్సవాలకు స్పెషల్‌ గిఫ్ట్..
Bangladesh Export Hilsa Fish To India
Follow us on

ఢాకా, సెప్టెంబర్ 22: గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారత్‌కు పద్మా పులస (హిలస) ఎగుమతికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అంగీకరించింది. దసరా పండుగ సీజన్‌కు ముందుగా దాదాపు 3,950 మిలియన్‌ టన్నుల పద్మా పులస భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయులకు ముఖ్యంగా బెంగాళీలకు ఈ మేరకు బంగ్లాదేశ్‌ తీపి కబురు చెప్పింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ పద్మా పులసను బెంగాలీలు చాలా ప్రత్యేకం. బెంగాల్‌లో దేశీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. దసరా పండుగ సీజన్‌లో బెంగాళీలు పద్మా పులస చేపలను తమ ఇళ్లలో వండుకుని ఇష్టంగా ఆరగిస్తారు. కొందరు దుర్గామాతకు నైవేధ్యంగా కూడా సమర్పిస్తారు.

ఈ నేపధ్యంలో బెంగాళీల దసరా పండుగకు గిఫ్ట్‌గా పద్మా పులస లేదా పద్మా హిలస చేపల ఎగుమతికి బంగ్లా ప్రభుత్వం ఓకే చెప్పడంతో బెంగాళీల్లో ఆనందం వెల్లివిరిసింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా దేవీ నవరాత్రులు రానున్న నేపథ్యంలో హిల్సా చేపలను భారత్‌కు కానుకగా పంపిస్తున్నట్లు ప్రకటించారు. దుర్గాపూజ సీజన్‌కి ముందు 4000 మెట్రిక్ టన్నులు హిల్సా చేపలను ఎగుమతి చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 20) వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. భారత్‌ చేపల వ్యాపారుల ద్వారా పద్మా హిలస దేశానికి అక్టోబర్ 30 వరకు విడతల వారిగా చేరుకుంటాయి. గురువారం నుంచే బెంగాల్‌లో పద్మా పులస రాక ప్రారంభమైంది.

బంగ్లా నుంచి పద్మా పులస పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో దిగుమతి జరుగుతుంది. అక్కడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు చేపల వ్యాపారుల ద్వారా సరఫరా అవుతాయి. బెంగాల్ మార్కెట్‌లో ప్రస్తుతం పద్మా పులస కిలో ధర కిలోకు దాదాపుగా 1000 రూపాయలుగా ఉంది. ఈ సందర్భంగా చేపల దిగుమతిదారుల అసోసియేషన్‌ కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌ దేవీ నవరాత్రుల సందర్భంగా బెంగాలీలకు ఇష్టమైన పద్మాపులసను ఎగుమతి చేసేందుకు బంగ్లాదేశ్‌ అంగీకరించడం సంతోషకరమైన వార్త. అక్కడి నుంచి చేపలను తీసుకురావడానికి 40 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. అంటే అక్టోబర్ 30వ తేదీలోపు దిగుమతి చేసకోవచ్చు. ఆ సమయాన్ని మరింత పెంచితే బాగుంటుందని ఆయన మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పద్మా పులస అనే పేరు ఎలా వచ్చిందంటే..

బంగ్లాదేశ్‌లోని ప్రముఖ నదుల్లో పద్మా నది ఒకటి. ఈ నదిలో మాత్రమే పులసలు దొరుకుతాయి. అందువల్లనే ఈ చేపలకు పద్మా పులస అనే పేరు వచ్చింది. 2012లో బంగ్లాదేశ్ నుంచి పులస దిగుమతిని కొన్ని కారణాల రిత్యా నిలిపేశారు. 2019లో ఇరు దేశాల మధ్య చర్చల అనంతరం మళ్లీ పులస దిగుమతికి బంగ్లాదేశ్ అనుమతిచ్చింది. ఈ ఏడాది 500 మెట్రిక్ టన్నుల పులసను దిగుమతికి అనుమతి ఇచ్చింది. 2020 నాటికి ఏకంగా 1850 మెట్రిక్‌ టన్నుల దిగుమతికి పెరిగింది. 2021లో 4600 మెట్రిక్ టన్నులు దిగుమతికి అనుమతి ఇవ్వగా.. కేవలం 1200 మెట్రిక్ టన్నుల పులస మాత్రమే అందుబాటులో ఉండటంతో దిగుమతి అయ్యింది. 2022లో 1300 మెట్రికల్ టన్నులు దిగుమతి అయింది. ఈ ఏడాది 4000 మెట్రిక్ టన్నుల దిగుమతికి అనుమతి ఉన్నా.. ఎంత మొత్తంలో దిగుమతి అవుతుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.