Hijab Controversy: కర్ణాటక హిజాబ్‌ వివాదం మరో కొత్త మలుపు.. నటుడు చేతన్‌కుమార్‌ అరెస్ట్‌

|

Feb 23, 2022 | 4:59 PM

Hijab Controversy: కర్ణాటక హిజాబ్‌ వివాదం కొత్త మలుపు తిరిగింది. హిజాబ్‌ వివాదంపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నడ నటుడు చేతన్‌కుమార్‌..

Hijab Controversy: కర్ణాటక హిజాబ్‌ వివాదం మరో కొత్త మలుపు.. నటుడు చేతన్‌కుమార్‌ అరెస్ట్‌
Follow us on

Hijab Controversy: కర్ణాటక హిజాబ్‌ వివాదం కొత్త మలుపు తిరిగింది. హిజాబ్‌ వివాదంపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నడ నటుడు చేతన్‌కుమార్‌ (Chetan Kumar)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరకరమైన ట్వీట్ చేసినందుకు చేతన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఐపిసి 505(2), 504 కింద చేతన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ట్వీట్ ఆధారంగా శేషాద్రిపురంలో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ప్రస్తుత కర్ణాటక చీఫ్ జస్టిస్ కృష్ణ దీక్షిత్‌ (Justice Krishna S. Dixit)పై వివాదాస్పద ట్వీట్‌ చేశారు చేతన్‌కుమార్‌. గతంలో ఓ రేప్‌ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్‌ను ప్రస్తావిస్తూ ఈ ట్వీట్‌ చేశారు చేతన్‌కుమార్‌.

అయితే తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపిస్తున్నారు చేతన్‌ భార్య మేఘ. ఎలాంటి నోటీసులు , కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. శేషాద్రిపురం పోలీసుస్టేషన్‌ బయట చేతన్‌ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన పోరాడారు. హిందూ సంస్థలకు వ్యతిరేకంగా కూడా చేతన్‌ పోరాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి చంపిన దుర్మార్గుడు..

Prashant Kishor: యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు..