Watch: పోలీస్‌స్టేషన్‌లో మంటలు.. కళ్లముందే కాలిబూడిదైన కార్లు, బైకులు..! ఏం జరిగిందంటే..

పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి సమీపంలో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. సమాచారం అందిన వెంటనే అనేక అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 2 గంటల పాటు శ్రమించిన తర్వాత, మంటలను అదుపులోకి తెచ్చారు.

Watch: పోలీస్‌స్టేషన్‌లో మంటలు.. కళ్లముందే కాలిబూడిదైన కార్లు, బైకులు..! ఏం జరిగిందంటే..
Many Vehicles Burnt

Updated on: Apr 06, 2025 | 8:27 AM

ఉత్తరప్రదేశ్‌లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంభాల్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగ తెగపడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక కార్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారి పోలీస్‌ స్టేషన్ చుట్టూ మంటలు వ్యాపించటంతో పోలీసులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ నుండి బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రమాదం కారణంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసిన వాహనాలు అనేకం మంట్లలో కాలి బూడిదయ్యాయి.

ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ చెప్పిన వివరాల ప్రకారం… సాయంత్రం వేళ పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసిన అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. స్టేషన్ హెడ్ చమన్ సింగ్ సహా సిబ్బంది వెంటనే మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి సమీపంలో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. సమాచారం అందిన వెంటనే అనేక అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 2 గంటల పాటు శ్రమించిన తర్వాత, మంటలను అదుపులోకి తెచ్చారు.

వీడియో ఇక్కడ చూడిండి..

ఇవి కూడా చదవండి

పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణ పైన ఉన్న 11000 వోల్ట్ హై టెన్షన్ విద్యుత్ వైర్ అకస్మాత్తుగా విరిగి పడిపోయింది. దీని కారణంగా పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పార్క్ చేసిన వాహనాల్లో మంటలు చెలరేగాయి. దాంతో అక్కడ పార్క్ చేసిన 10 నుండి 12 వాహనాలు కాలిపోయాయి. మంటలను అదుపులోకి తెచ్చారు. నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..