Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hemant Soren: జైలు నుంచి విడుదలై మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ గురువారం సాయంత్రం మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు చంపై సోరెన్ బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు.

Hemant Soren: జైలు నుంచి విడుదలై మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Hemant Soren
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 04, 2024 | 6:46 PM

జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ గురువారం సాయంత్రం మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు చంపై సోరెన్ బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జేఎంఎం నేత హేమంత్ సోరెన్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. హేమంత్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

జూలై 7న హేమంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. అంతకుముందు, రాంచీలోని చంపై సోరెన్ నివాసంలో జరిగిన సమావేశంలో అధికార కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు జార్ఖండ్ ముక్తి మోర్చా లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా హేమంత్ సోరెన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో సీఎం పదవికి చంపై సోరెన్ రాజీనామా సమర్పించారు. అంతకు ముందు చంపై సోరెన్, హేమంత్ సోరెన్‌లతో పాటు గవర్నర్‌ను కలిసిన రాష్ట్ర అధికార కూటమి ప్రతినిధి బృందంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు, మంత్రి సత్యానంద్ భోక్తా, CPI (ML) ఎమ్మెల్యే వినోద్ సింగ్ కూడా పాల్గొన్నారు.

తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించిన అనంతరం చంపై సోరెన్ మాట్లాడుతూ, “జేఎంఎం నేతృత్వంలోని కూటమి నిర్ణయం మేరకు రాజీనామా చేశానని, రాష్ట్రంలో తమ కూటమి బలంగా ఉందన్నారు. కూటమి హేమంత్ సోరెన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదిలావుంటే, భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూన్ నెల జూన్ 28న హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 5 నెలల పాటు జైలులోనే ఉన్నారు. జనవరి 31న అరెస్టు కాకముందే హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేశారు. మరి కొన్ని నెలల్లో అంటే వచ్చే నవంబర్ – డిసెంబర్ నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో హేమంత్ మళ్లీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..