బెంగళూరులో భారీ వర్షం..

|

May 25, 2020 | 10:13 AM

బెంగళూరులో మండువేసవిలో భారీవర్షం కురిసింది. నగరంలో ఆకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల జోరుగా వర్షం కురవడంతో చాలా రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై చెట్లు కుప్పకూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ లో నిండిపోయి మురికినీరు రోడ్ల మీదకు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎధుర్కొంటున్నారు. వేగంగా వీచిన ఈదురుగాలులకు బీటీఎం లేఅవుట్‌లో పలు […]

బెంగళూరులో భారీ వర్షం..
Follow us on

బెంగళూరులో మండువేసవిలో భారీవర్షం కురిసింది. నగరంలో ఆకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల జోరుగా వర్షం కురవడంతో చాలా రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై చెట్లు కుప్పకూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ లో నిండిపోయి మురికినీరు రోడ్ల మీదకు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎధుర్కొంటున్నారు. వేగంగా వీచిన ఈదురుగాలులకు బీటీఎం లేఅవుట్‌లో పలు చెట్లు కూలిపోయాయి.

కాగా, మే 30 వరకు బెంగళూరులో వర్షాలు కురుస్తాయని బారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని, చల్లని ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 36 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి.