ఢిల్లీలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షాలు, పెనుగాలులతో నగరం తల్లడిల్లింది. ముఖ్యంగా తీన్ మూర్తి, జన పథ్ రోడ్లలో మోకాలి లోతున నీరు ప్రవహించింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా కాచినా సాయంత్రమయ్యేసరికి ఇలా వెదర్ మారిపోవడంతో నగర వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ వాతావరణ శాఖ సైతం ఈ మార్పును అంచనా వేయలేకపోయారు. కాగా-గత నెలలో నగరంలో 236. 5 మీ.మీ. వర్షపాతం నమోదయింది. ఏడేళ్ల తరువాత ఇంతగా వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి.
#WATCH Heavy rainfall triggers waterlogging near Teen Murti area in New Delhi pic.twitter.com/8SzaMhARGx
— ANI (@ANI) September 5, 2020