Heat Wave: దేశ రాజధానిలో నిప్పులు చెరుగుతున్న భానుడు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి..

Delhi Heat Wave: మాడు పగిలిపోతోంది. నెత్తి మీద నిప్పులు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు విలవిలలాడిపోతున్నారు జనం. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డ్‌ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Heat Wave: దేశ రాజధానిలో నిప్పులు చెరుగుతున్న భానుడు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి..
Delhi Heat Waves

Updated on: Apr 29, 2022 | 8:54 AM

మాడు పగిలిపోతోంది. నెత్తి మీద నిప్పులు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు విలవిలలాడిపోతున్నారు జనం. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డ్‌ స్థాయి ఉష్ణోగ్రతలు(Heat Wave) నమోదవుతున్నాయి. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్‌లో సెగలు పుట్టిస్తున్నాడు భానుడు. 43.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక గుర్‌గావ్‌లో అయితే 45.6డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌ రికార్డైంది. ఢిల్లీలో 1941 ఏప్రిల్‌ 29న 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే ఆల్‌ టైమ్‌ హై టెంపరేచర్‌. ఇక 2010 ఏప్రిల్‌ 18న 43.7డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవగా..తాజాగా మళ్లీ ఆస్థాయిలో హీట్‌ వేవ్స్‌ రికార్డయ్యాయి. మరోవైపు 5 రాష్ట్రాలకు IMD వార్నింగ్‌ జారీ చేసింది. ఢిల్లీ, రాజస్థాన్‌, హర్యానా, ఒడిశా, యూపీ రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సాధారణం కంటే 2,3 డిగ్రీల ఎక్కువ టెంపరేచర్‌ నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.

వాయువ్య భారత దేశంలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల తర్వాత కూడా పరిస్థితులో మార్పు ఉండదని..మరింత తీవ్రమవుతాయని హెచ్చరించింది.

ఆదివారం ఉపశమనం పొందవచ్చు

ఢిల్లీలో ఆదివారం పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో కదలగలవు. ఇది వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. వాతావరణ శాఖ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం, ఢిల్లీ ‘కోర్ హీట్‌వేవ్ జోన్’లో వస్తుంది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇది రాష్ట్రాల్లో అత్యధికం. తీవ్ర ఉష్ణ సంభావ్య ప్రాంతం ఉంది.

ఎందుకు వేడెక్కుతోంది?

మరోవైపు మార్చి చివరి వారం నుంచి వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో వర్షాలు కురవకపోవడం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఇలా జరుగుతోందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: Ramya Murder Case: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో విచారణ పూర్తి.. ఇవాళ కోర్టు తీర్పు 

Acharya Movie Release Live: ప్రేక్షకుల ముందుకు ఆచార్య.. కోలాహలంగా మారిన థియేటర్స్.. అభిమానుల రచ్చ