రాహుల్‌కు పెళ్లి చేద్దామా ? ఎప్పుడు చేద్దాం.. అంటూ హర్యానాకు చెందిన ఓ మహిళా రైతు సోనియాతో ముచ్చట్లు చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది. మీరే అమ్మాయిని చూడండి.. పెళ్లి చేద్దాం.. అంటూ సోనియా సమాధానం ఇవ్వడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్ జోడో యాత్ర తరువాత కూడా ప్రజలతో మమేకం అవుతున్నారు రాహుల్‌గాంధీ. కొద్దిరోజుల క్రితం రాహుల్‌గాంధీ హర్యానాలో పర్యటించిన సమయంలో.. సోనీపత్ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులు ఢిల్లీకి రావాలని ఉందని చెప్పారు. దీంతో రాహుల్ వాళ్లను సోనియా నివాసానికి ఆహ్వానించారు. హర్యానా నుంచి వచ్చిన ఆ మహిళలు ముందుగా ఢిల్లీ లోని పలు ప్రాంతాలను సందర్శించారు. తరువాత 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి చేరుకున్నారు.
ఢిల్లీలో సోనియా నివాసానికి హర్యానాకు చెందిన మహిళా రైతులు వచ్చినప్పుడు ఆసక్తికరమైన ఘటన జరిగింది. మహిళా రైతులకు విందు ఇచ్చారు సోనియాగాంధీ. రాహుల్‌గాంధీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా… అని ఓ మహిళా రైతు సోనియాను ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఇంకా ఎన్నాళ్లు ఒంటరిగా ఉంటారని , పెళ్లి చేయాలని సూచించారు ఆ మహిళా రైతు. అయితే ఈ ప్రశ్నకు సోనియా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అమ్మాయిని చూడండి.. వెంటనే పెళ్లి చేద్దామని చెప్పుకొచ్చారు.
मां, प्रियंका और मेरे लिए एक यादगार दिन, कुछ खास मेहमानों के साथ!
सोनीपत की किसान बहनों का दिल्ली दर्शन, उनके साथ घर पर खाना, और खूब सारी मज़ेदार बातें।
साथ मिले अनमोल तोहफे – देसी घी, मीठी लस्सी, घर का अचार और ढेर सारा प्यार।
पूरा वीडियो यूट्यूब पर:https://t.co/2rATB9CQoz pic.twitter.com/8ptZuUSDBk
— Rahul Gandhi (@RahulGandhi) July 29, 2023
హర్యానా మహిళలను గాంధీ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే గాక.. సోనియా, ప్రియాంక , రాహుల్ గాంధీ కూడా మహిళలతో కలిసి భోజనం చేశారు. ఓ మహిళ సోనియా గాంధీ చెవిలో.. ‘రాహుల్‌కు పెళ్లి చేద్దామా?’ అని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి’ అని అనడంతో రాహుల్ నవ్వుతూ ‘అవుతుంది.. అవుతుంది’ అని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి మహిళలు సోనియాను అడగ్గా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అమ్మ చాలా కుంగుబాటుకు లోనయ్యారని, కొన్ని రోజుల పాటు అన్నం, నీళ్లు ముట్టలేదని ప్రియాంక చెబుతుండగా సోనియా కన్నీటి పర్యంతమయ్యారు. మహిళా రైతులతో కలిసి సోనియా, ప్రియాంక నృత్యం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..