Doctor Negligence: వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత ప్రాణాలకు ముప్పు.. అప్రమత్తమై ఏం చేశారంటే

ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కొన్ని సార్లు ప్రాణాపాయం కలిగిస్తున్నారు. వైద్యం చేసే సమయంలో నిర్లక్ష్యంగా(Doctor Negligence) ఉంటూ రోగుల ప్రాణాలపై తీసుకువస్తున్నారు. తమ ప్రాణాలు కాపాడతారనే నమ్మకంతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు...

Doctor Negligence: వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత ప్రాణాలకు ముప్పు.. అప్రమత్తమై ఏం చేశారంటే
Medical Negligence

Updated on: Mar 24, 2022 | 8:49 AM

ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కొన్ని సార్లు ప్రాణాపాయం కలిగిస్తున్నారు. వైద్యం చేసే సమయంలో నిర్లక్ష్యంగా(Doctor Negligence) ఉంటూ రోగుల ప్రాణాలపై తీసుకువస్తున్నారు. తమ ప్రాణాలు కాపాడతారనే నమ్మకంతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు హాస్పిటళ్లు ఆ మేరకు భద్రత ఇవ్వడం లేదు. తాజాగా ఒడిశాలోని రాయగడ (Rayagada) లో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఆపరేషన్ (Operation) చేసిన సమయంలో బాధితురాలి పొట్టలో హ్యాండ్ గ్లోవ్స్ వదిలేశారు. అలాగే కుట్లు వేసి, ఇంటికి పంపించారు. కొన్ని రోజుల తర్వాత కడుపు నొప్పి రావడంతో అసలు విషయం బయటపడింది. ఆమె భర్త అప్రమత్తమై విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి బాధితురాలిని కాపాడారు. రాయగడ జిల్లా కేంద్రాసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా బిరిగూడ గ్రామానికి కాంచన్‌ అనే మహిళ.. ప్రసవం కోసం గతేడాది అక్టోబర్‌ 3న రాయగడలోని జిల్లా కేంద్రాసుపత్రికి వచ్చారు. ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు అక్టోబర్‌ 8న డిశ్చార్జ్‌ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళకు ఆపరేషన్ అయిన 15 రోజుల తరువాత కడుపునొప్పి వచ్చింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాలింతను మళ్లీ జిల్లా కేంద్రాసుపత్రికి వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రాబ్లం ఏమీ లేదని చెప్పి మందులు ఇచ్చి పంపించారు.

మూడు నెలల తరువాత కడుపునొప్పి మళ్లీ తీవ్రం కావడంతో ఈ ఏడాది జనవరి 31న కొరాపుట్‌లో జిల్లా కేంద్రాసుపత్రిలో చేర్పించారు. స్కానింగ్‌ చేసిన వైద్యులు కాంచన్‌ పొట్టలో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయాలని లేకుంటే ఆమె ప్రాణానికి ప్రమాదమని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం పై స్థాయి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంచన్ ను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి పొట్టలో హ్యాండ్ గ్లోవ్స్ ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించారు. చికిత్స కోసం రూ.12 లక్షల వరకు ఖర్చు అయిందని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

Also Read

TV9 News Room Live: లోకల్ టూ గ్లోబల్.. ఫటా ఫట్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ మీ కోసం…(వీడియో)

Telangana Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా స్టడీ సెంటర్ల ఏర్పాటు.

Betel Leaf: ఎండకాలంలో పాన్ తింటే ఎన్నో ప్రయోజనాలు.. తమలాపాకులతో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..