
స్కూల్‌లో విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ తప్పుదోవ పట్టాడు. పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. చివరికి జైలులో ఊసలు లెక్కపెట్టాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని సూరత్‌లో ఓం ప్రకాశ్ యాదవ్ అనే టీచర్.. 2018లో 13 ఏళ్ల బాలికను స్టాఫ్ రూమ్‌లోకి పిలిచి.. తలుపులు, కిటికీలు మూసి ఆమెను ముద్దు పెట్టుకుని.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదుతో సదరు టీచర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బడిలో టీచర్లు ఇంట్లో తల్లిదండ్రులతో సమానమని.. సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం ఎంతో అత్యుత్తమైనదని చెప్పిన కోర్టు.. ఆ టీచర్‌కు రూ. 9 వేల జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
కాగా, ఈ ఘటనలో సదరు బాధితురాలు ఏడుస్తూ పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఎంక్వయిరీ చేయగా.. జరిగిన విషయాన్ని అంతా చెప్పింది బాధితురాలు. కొందరు స్టూడెంట్స్ బుక్స్‌ను చూసేందుకు స్టాఫ్ రూమ్‌కి తనను టీచర్ యాదవ్ పిలుస్తున్నాడని.. ఓ విద్యార్ధి ఆమెకు చెప్పినట్టుగా పేర్కొంది బాధితురాలు. తద్వారా తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలియడంతో.. వాళ్లు ఆ టీచర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.