AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎడమ కంటికి జబ్బు చేస్తే కుడి కంటికి ఆపరేషన్‌.. డాక్టర్ నిర్లక్ష్యంపై పెల్లుబికిన ఆగ్రహం

కొంత మంది వైద్యులు డాక్టర్ వృత్తికే మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. డబ్బు కోసం జనాల ప్రాణాలతో చలగాటం ఆడుతుంటారు. తాజాగా అటువంటి ఘటనే యూపీలో చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడు కంటి ఆపరేషన్ కోసం వెళ్తే ఒక కంటికి బదులు మరొక కంటికి ఆపరేషన్ చేశాడు. ఇదేంటని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం ఇవ్వడం గమనార్హం..

ఎడమ కంటికి జబ్బు చేస్తే కుడి కంటికి ఆపరేషన్‌.. డాక్టర్ నిర్లక్ష్యంపై పెల్లుబికిన ఆగ్రహం
Doctor Operates On Wrong Eye
Srilakshmi C
|

Updated on: Nov 15, 2024 | 4:54 PM

Share

లక్నో, నవంబర్‌ 15: వైద్యం కోసం వచ్చిన పేషెంట్‌ పట్ల ఓ డాక్టర్‌ నిర్లక్ష్య వైఖరి ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. ఏడేళ్ల బాలుడికి ఎడమ కంటికి చికిత్స కోసం వేస్తే బదులు కుడి కంటికి ఆపరేషన్‌ చేసి పంపించాడు. దీనిపై ఆగ్రహించిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నవంబర్ 12న ఉత్తర ప్రదేశ్‌లోని సెక్టార్ గామా 1లోని ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో సెక్టార్ గామా 1లోని ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్‌కి ఏడేళ్ల బాలుడు యుధిష్ఠిర్‌ను తల్లిదండ్రులు తీసుకువచ్చారు. బాలుడి ఎడమ కంటి నుంచి నీరు కారుతుందని వైద్యుడు ఆనంద్‌ వర్మకు తెలిపారు. ఆయన పలు పరీక్షలు జరిపి బాలుడి కంటిలో ప్లాస్టిక్‌ వంటి పదార్ధం ఉందని, ఆపరేషన్‌ చేసి తొలగించాలని తెలిపాడు. ఆపరేషన్‌కు రూ.45 వేలు ఖర్చు అవుతుందని తెలిపాడు. దీంతో యుధిష్ఠిర్‌కు మంగళవారం ఆపరేషన్‌ జరిపారు. ఇంటికి వచ్చాక చూస్తే బాలుడి ఎడమ కంటికి బదులు కుడి కంటికి బ్యాండేజ్‌ వేసి ఉండటం చూసి తల్లి అవాక్కయ్యింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఇదేంటని ప్రశ్నించగా.. ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ ఆనంద్‌ వర్మ, ఆసుపత్రిలోని ఇతర సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు.

దీంతో బాలుడి తల్లిదండ్రులు గౌతమ్‌ బుద్ధ నగర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంవో)కి ఫిర్యాదు చేశారు. ఆ డాక్టర్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని, ఆ హాస్పిటల్‌ను మూసివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ డాక్టర్ లైసెన్స్‌ రద్దు చేయాలని, ఆసుపత్రికి సీల్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.