Cyber Crimes: టాస్క్‌ పేరుతో సైబర్‌ క్రైమ్స్.. కేంద్ర హోంశాఖ కీలక సూచనలు

|

Sep 24, 2023 | 8:40 PM

ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్లు రావడంతో.. కొందరు తెలిసి.. తెలియక పలు లింకులను క్లిక్ చేస్తూ తమ సొమ్మును పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరాల గురించి పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఓ చోట ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు సైబర్ కేటుగాళ్లు కూడా ఎప్పటికప్పుడు అప్‌డెట్ అవుతూ కొత్త పంథాలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు.

Cyber Crimes: టాస్క్‌ పేరుతో సైబర్‌ క్రైమ్స్.. కేంద్ర హోంశాఖ కీలక సూచనలు
Cyber crime
Follow us on

ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్లు రావడంతో.. కొందరు తెలిసి.. తెలియక పలు లింకులను క్లిక్ చేస్తూ తమ సొమ్మును పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరాల గురించి పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఓ చోట ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు సైబర్ కేటుగాళ్లు కూడా ఎప్పటికప్పుడు అప్‌డెట్ అవుతూ కొత్త పంథాలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఎక్కువగా.. ఓటీపీలు, ప్రకటనలు, పలు ఆఫర్ల పేరుతో యూజర్ల నుంచి డబ్బలు లాగేసుకున్న నేరగాళ్లు.. ఇప్పుడు మరో తాజా మోసానికి తెర లేపారు. టాస్క్-బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే పేరుతో ప్రస్తుతం మోసాలు చేస్తున్నారు. ఈ సైబర్ మోసాల వల్ల చాలామంది వేలు, లక్షలు పోగొట్టుకున్నారు. కోట్లు కూడా పోగొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.

సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను ఫాలో అవ్వడం, యూట్యూబ్ వీడియోలకు లైక్‌లు, కామెంట్లు చేయడం.. అలాగే పలు హోటళ్లు, రెస్టారెంట్లు, కొత్త సినిమాలకు రివ్యూ ఇస్తే.. డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అయితే ఇలాంటి చరహా మోసాలు ఎక్కవగా.. టెలిగ్రామ్ యాప్‌లో జరుగుతున్నాయని.. సైబర్ నేరాల నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ దోస్త్ పేర్కొంది. అయితే ఇలాంటి తరహా మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అయితే సెల్‌ఫోన్‌కు ఇటువంటి మోసపూరితమైన ప్రకటనలతో మెసేజ్‌లు వచ్చినట్లైతే వాటిని నమ్మకూడదని హెచ్చరికలు చేసింది. అయితే వీటి గురించి cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో లేకపోతే 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచనలు చేసింది. అయితే తాజాగా టాస్క్‌-బేస్డ్‌ మోసాల గురించి అవగాహనలు కల్పిస్తూ ఎక్స్‌ (ట్విట్టర్)లో 39 సెకన్ల నిడివి ఉన్న వీడియోను షేర్ చేసింది. ఇదిలా ఉండగా.. రోజురోజుకి సాంకేతికత పెరుగుతన్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు కచ్చితంగా అవగాహన చేసుకోవాలని.. లేకపోతే.. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పోగొట్టుకోవాల్సి వస్తుందని… సైబర్ నిపుణలు సూచనలు చేస్తున్నారు. ఇలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..