‘ వాళ్ళిద్దరి వల్లే దేశంలో నిరుద్యోగ భూతం ‘.. రాహుల్ గాంధీ ధ్వజం

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో కూడిన ప్రభుత్వ..ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల కారణంగానే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నేడు ‘ భారత్ బంద్ ‘ కు పిలుపునిచ్చిన 25 కోట్ల మంది కార్మికులకు తాను సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ బంద్ కు ఆయన పూర్తి మద్దతును ప్రకటించారు .’ మోదీ, షాల ప్రభుత్వం ఈ దేశంలో నిరుద్యోగ భూతాన్ని సృష్టించింది. తన క్రోనీ […]

 వాళ్ళిద్దరి వల్లే దేశంలో నిరుద్యోగ భూతం .. రాహుల్ గాంధీ ధ్వజం

Updated on: Jan 08, 2020 | 1:38 PM

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో కూడిన ప్రభుత్వ..ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల కారణంగానే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నేడు ‘ భారత్ బంద్ ‘ కు పిలుపునిచ్చిన 25 కోట్ల మంది కార్మికులకు తాను సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ బంద్ కు ఆయన పూర్తి మద్దతును ప్రకటించారు .’ మోదీ, షాల ప్రభుత్వం ఈ దేశంలో నిరుద్యోగ భూతాన్ని సృష్టించింది. తన క్రోనీ కేపిటలిస్టు స్నేహితులను సంతృప్తి పరచేందుకు మోదీ…  ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తున్నారు ‘అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ సంస్థలను ప్రైవేటీకరించేందుకు అనువుగా కేంద్రం చేపడుతున్న విధానాలను నిరసిస్తూ.. ఏఐటీయూసీ, సీఐటీయు, ఎల్ పీ ఎఫ్ సంస్థలు బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు జరిగాయి. అనేకచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.