విదేశాంగ మంత్రి యుఎస్ పర్యటనలో ఏం జరిగింది ?

|

Dec 21, 2019 | 1:24 PM

అమెరికాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఓ సీనియర్ ఎంపీతో జరపవలసిన సమావేశం రద్దయిందంటూ వఛ్చిన వార్తలను పూర్తిగా వక్రీకరించారని అమెరికా అధికారులు తెలిపారు. యుఎస్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీతో ఆయన సమావేశం కావలసి ఉంది.(నిజానికి ఈ కమిటీతో ఆయన భేటీ అయ్యారు). అయితే దీన్ని ఆయన రద్దు చేసుకున్నారన్నదే ఈ వార్తల సారాంశం. ఈ కమిటీలో డెమొక్రాట్ ఎంపీ అయిన ప్రమీలా జయపాల్ సభ్యురాలు కాకున్నా.. ఆమెతో కూడా ఆయన భేటీ కాలేదు.అయితే కాశ్మీర్ […]

విదేశాంగ మంత్రి యుఎస్ పర్యటనలో ఏం జరిగింది ?
Follow us on

అమెరికాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఓ సీనియర్ ఎంపీతో జరపవలసిన సమావేశం రద్దయిందంటూ వఛ్చిన వార్తలను పూర్తిగా వక్రీకరించారని అమెరికా అధికారులు తెలిపారు. యుఎస్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీతో ఆయన సమావేశం కావలసి ఉంది.(నిజానికి ఈ కమిటీతో ఆయన భేటీ అయ్యారు). అయితే దీన్ని ఆయన రద్దు చేసుకున్నారన్నదే ఈ వార్తల సారాంశం. ఈ కమిటీలో డెమొక్రాట్ ఎంపీ అయిన ప్రమీలా జయపాల్ సభ్యురాలు కాకున్నా.. ఆమెతో కూడా ఆయన భేటీ కాలేదు.అయితే కాశ్మీర్ పై భారత ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టే ఆమెతో సమావేశం కాకూడదనే ఆయన నిర్ణయించుకున్నారట.. కానీ ఆమెతో జయశంకర్ భేటీ కావడానికి అభ్యంతరాలేవీ లేవని, ఏ దేశ విదేశాంగ మంత్రి అయినా తమ సొంత ఎజెండాలు కలిగి ఉన్న ఎంపీలతో సమావేశం కావచ్ఛునని వాషింగ్టన్ లో అధికారులు తెలిపారు. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. కాశ్మీర్ విషయంలో ప్రమీలా జయపాల్ వైఖరి అందరికీ తెలిసిందేనన్నారు. అసలు హౌస్ ఫారిన్ కమిటీ సభ్యులతో జయశంకర్ భేటీ అయ్యారు. రెండు పక్షాల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి అని వారు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ఇటీవల ప్రమీలా జయపాల్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆమెకు 29 మంది కో-స్పాన్సర్స్ మద్దతునిచ్చారు.
డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థులైన బెర్నీ సాండర్స్, ఎలిజిబెత్ వారెన్ మాత్రం.. ప్రమీలా జయపాల్ తో జయశంకర్ సమావేశం కాకపోవడంపట్ల తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. కాశ్మీరీలు, ముస్లిములకు అనుకూలంగా ఆమె మాట్లాడినంత మాత్రాన ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియడంలేదన్నారు. ప్రమీలా జయపాల్ నోరు నొక్కడానికి జరుగుతున్న యత్నాలను వారు ఖండించారు. భారత-అమెరికా దేశాల మధ్య చక్కని భాగస్వామ్యం ఉందని, మంచి వాతావరణంలో జరిగే చర్చలు దీన్ని మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు.