సోమవారం ఆమోదం పొందిన ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ, దాని అనుకూల పక్షాలు సంబరాలు జరుపుతుంటే.. విపక్షాలకు చెందిన పార్టీలు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. సీపీఐ జాతీయ అధ్యక్షడు రాజా మాట్లాడుతూ ఆర్టికరల్ 370ని రద్దు చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలను మరింత దూరం చేయడానికే ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. దేశ ఆర్ధిక విధానలపై చర్చించలేక .. దేశ ప్రజల దృష్టిని మళ్లించి జాతీయత పేరుతో కశ్మీర్‌లో భయాందోళనలు సష్టిస్తున్నారని రాజా ఆరోపించారు.