Covid-19 vaccination: ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కోవిడ్ వ్యాక్సిన్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం..

|

May 23, 2021 | 6:09 AM

Coronavirus vaccination drives: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో

Covid-19 vaccination: ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కోవిడ్ వ్యాక్సిన్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం..
Covid 19 vaccine
Follow us on

Coronavirus vaccination drives: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కోవిడ్ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే.. కరోనా వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొడిగా కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి.. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రాణాళికలు రూపొందిస్తోంది. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా.. ప్రైవేటు కార్యాలయాల్లో నిర్వహించే టీకా డ్రైవ్‌లో వ్యాక్సిన్ వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

కార్యాలయాల్లో ఏర్పాటు చేసే టీకా డ్రైవ్‌లో ఉద్యోగులందరితో పాటు వారిపై ఆధారపడినవారు, కుటుంబ సభ్యులకు కూడా టీకాను వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు కార్యాలయ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో లబ్ధిదారులకు టీకాలు వేయడానికి టీకా డోసులను ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి సేకరించవలసి ఉంటుందని కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి ఆయా ప్రైవేటు సంస్థలు ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలతోపాటు.. కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ నెల ప్రారంభం నాటినుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులకు ప్రైవేటు కార్యాలయాల్లో టీకాలు వేసేలా.. ఏప్రిల్ 6న ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే.. తాజాగా ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా టీకాలు వేసేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read:

Black Fungus: చిన్న ప్రేగులకు బ్లాక్ ఫంగస్.. వెల్లడించిన గంగారామ్ ఆసుపత్రి వైద్యులు..

Cyclone Tauktae: నేనేమీ హెలికాప్టర్‌లో ఉండి ఫొటో సెషన్ నిర్వహించలేదు.. బీజేపీ నేతలపై సీఎం ఉద్ధవ్ ఫైర్