Operation Sindoor: పాక్ దాడిలో భారత అధికారి మృతి.. ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..

జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో పాకిస్తాన్ తీవ్ర దాడులు చేస్తున్న నేపథ్యంలో, ఎనిమిది పాక్ నగరాలపై భారత్ ప్రతీకార దాడులు చేసింది. ఇస్లామాబాద్‌పై డ్రోన్ దాడి చేసినట్లు సమాచారం అందింది. ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్‌కోట్, లాహోర్, పెషావర్, గుజ్రాన్‌వాలా, అటోక్ వంటి నగరాల్లో భారత్ ప్రతీకార దాడులు చేసింది.

Operation Sindoor: పాక్ దాడిలో భారత అధికారి మృతి.. ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..
Pakistan Shelling Attack

Updated on: May 10, 2025 | 8:32 AM

భారతదేశం, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాక్‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్‌ బలమైన దాడి ప్రారంభించింది. ఈ క్రమంలోనే జమ్మూ, కాశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులు, కాల్పులు జరిగాయి. పాకిస్తాన్‌లోని అనేక విమానాశ్రయాలలో శనివారం ఉదయం శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మృతి చెందినట్టుగా తెలిసింది. అధికారి ఇద్దరు సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. రాజౌరిలోని డీసీ కాలనీలోని తన ఇంటిపై నిన్న రాత్రి షెల్ పడటంతో తప్పా గాయపడ్డారు. ఆ ప్రాంతంలో రాత్రంతా భారీ కాల్పులు కొనసాగాయి. తీవ్ర గాయాలపాలైన తప్పా కొన్ని గంటల మరణించారు. శనివారం ఉదయం తప్పా మరణానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు.

రజౌరీ నగరంలో జరిగిన పాక్ షెల్లింగ్ దాడిలో అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ తప్పా మరణించారని సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.. థాపా మృతికి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు. రాజౌరి నుండి నిజంగా విషాదకర వార్త వినాల్సి వచ్చిందని అన్నారు. మనం జమ్మూ కాశ్మీర్‌ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌కు చెందిన అంకితభావంతో పనిచేసే అధికారిని కోల్పోయామని చెప్పారు.. నిన్ననే ఆయన డిప్యూటీ సీఎంతో కలిసి జిల్లా చుట్టూ తిరిగారని చెప్పారు. సీఎం అధ్యక్షత వహించిన ఆన్‌లైన్ సమావేశానికి కూడా హాజరయ్యారని చెప్పారు. ఇంతలోనే శనివారం ఆయన నివాసంపై పాక్ కాల్పులు జరిపిందని.. రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని మన అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ తప్పాను చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ తప్పా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని కోరుతూ ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో పాకిస్తాన్ తీవ్ర దాడులు చేస్తున్న నేపథ్యంలో, ఎనిమిది పాక్ నగరాలపై భారత్ ప్రతీకార దాడులు చేసింది. ఇస్లామాబాద్‌పై డ్రోన్ దాడి చేసినట్లు సమాచారం అందింది. ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్‌కోట్, లాహోర్, పెషావర్, గుజ్రాన్‌వాలా, అటోక్ వంటి నగరాల్లో భారత్ ప్రతీకార దాడులు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..