Oximeter Apps Download: గుర్తుతెలియని యూఆర్‌ఎల్‌ల నుంచి ఆక్సీమీటర్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వారికి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. శరీరంలోని ఆక్సిజన్ లెవల్ ఎంతుందో చూపిస్తామని చెప్పే యాప్‌లు నిజం కాదని తెలిపింది. అంతేకాదు ఇమేజ్‌లు, కాంటాక్ట్‌లు వంటి వ్యక్తిగత డేటాను ఈ యాప్‌లు తస్కరిస్తాయని తెలిపింది. అంతేకాదు యాప్‌కి బయోమెట్రిక్ ఫింగర్‌ఫ్రింట్‌ని పెట్టి యూజర్‌కి చెందిన బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్‌ని కూడా దొంగలిచ్చవచ్చని హెచ్చరించింది.
కాగా మన హృదయస్పందనను ట్రాక్ చేయడం ద్వారా రక్తంలో ఉన్న ఆక్సిజన్ లెవల్స్‌ని ఈ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే యూజర్ ఎత్తుని బట్టి శ్వాసించే ఆక్సిజన్ శాతాన్ని చెప్తాయి. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్‌ని చూసుకోవాలని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆక్సీమీటర్ పరికరాలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో, మార్కెట్లలో దొరుకుతున్నాయి. కానీ కొంతమంది యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. వాటిలో అన్ని సురక్షితం కాదని కేంద్ర మంత్రిత్వశాఖ సోషల్ మీడియాలో వెల్లడించింది.
కచ్చితంగా ఉన్న వాటినే డౌన్‌లోడ్ చేసుకోవాలని మంత్రిత్వశాఖ తెలిపింది. అంటే యాపిల్ ఆప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆక్సీమీటర్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, కానీ ఏదైనా ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ లేదా సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను నమ్మకండని స్పష్టం చేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో యూపీఐ యాప్‌ల ద్వారా డిస్కౌంట్ కూపన్లు, క్యాష్ బ్యాక్ లేదా ఫెస్టివల్ కూపన్‌లకు సంబంధించిన ప్రకటనలు వచ్చినా సరే దూరంగా ఉండాలని పేర్కొంది. అలా మభ్యపెట్టి యూజర్ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది.
Read More:
అధిక ఫీజులు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు.. టాస్క్‌ఫోర్స్ దర్యాప్తులో కీలక విషయాలు