అధిక ఫీజులు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు.. టాస్క్‌ఫోర్స్ దర్యాప్తులో కీలక విషయాలు

కరోనా వేళ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేశాయని టాస్క్‌ఫోర్స్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది

అధిక ఫీజులు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు.. టాస్క్‌ఫోర్స్ దర్యాప్తులో కీలక విషయాలు
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2020 | 10:40 AM

Hyderabad Private Hospitals: కరోనా వేళ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేశాయని టాస్క్‌ఫోర్స్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఫీజుల పేరుతో రోగుల నుంచి లక్షల రూపాయలు గుంజినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా, అంటువ్యాధుల చట్టాన్ని అతిక్రమించినట్లు టాస్క్‌ఫోర్స్‌ గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే కరోనా చికిత్సలో ప్రైవేట్‌ ఆసుపత్రుల పనిని పర్యవేక్షించేందుకు ముగ్గురు ఐఏఎస్‌లతో రాష్ట్రప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్ ఐఏఎస్‌లు రాహుల్‌ బొజ్జా, సర్ఫరాజ్‌ అహ్మద్, డి.దివ్య ఉండగా వారు దర్యాప్తు చేశారు. దానికి సంబంధించిన నివేదికను టాస్క్‌ఫోర్స్ నేడో, రేపో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

ఫిర్యాదులు అందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆకస్మిక తనిఖీలు చేసి, క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఇందుకోసం కొందరు సీనియర్ వైద్య నిపుణుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. రోగులకు ఉన్న లక్షణాలు, ఇచ్చిన మందులు, చేసిన వైద్యంపై వీరు దర్యాప్తును చేశారు. ఈ క్రమంలో కొన్ని ఆసుపత్రులు సర్కారు రేట్లకు 15 రెట్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రులపై అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద తగు చర్యలు తీసుకునేలా టాస్క్‌ఫోర్స్‌ ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

Read More:

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ‘నో సోషల్ డిస్టేన్స్‌’

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,296 కొత్త కేసులు.. 10 మరణాలు

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..